మాలీ బంగారు గని కుప్పకూలిన ఘటన-70 మంది మృతి
మాలీ బంగారు గని కుప్పకూలిన ఘటనలో సుమారు 70 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అక్రమ మైనింగ్ వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని తెలిపింది. మైనింగ్ సమయంలో ఎలాంటి సేఫ్టీ ప్రకటించకపోవడం వల్ల ఈ దారుణం జరిగింది.
ఘటనా సమయంలో 200 మందికిపైగా కార్మికులు ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకూ 70 మృతదేహాలు బయటకు తీసినట్లు తెలుస్తోంది.
మృతుల్లో ఎక్కువగా మైనర్లు ఉండటం విశేషం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.