శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (13:12 IST)

గినియా దేశంలో తిరుగుబాటు.. సైన్యం నిర్బంధంలో అధ్యక్షుడు

ఆఫ్రికా దేశాల్లో ఒకటైన గినియా దేశంలో తిరుగుబాటు మొదలైంది. ఫలితంగా ఆ దేశ అధ్యక్షుడు అల్ఫా కొంటేని గినియా దేశ సైన్యం నిర్బంధించింది. 
 
ఇటీవలే ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే. ఫలితంగా అక్కడ అంతర్యుద్ధానికి ఆజ్యం పోశారు. తాలిబన్లకు, తాలిబన్ల వ్యతిరేకులకు మధ్య పోరు ఉధృతంగా సాగుతోంది. ఫలితంగా ప్రజా జీవనం పూర్తిగా అస్తవ్యస్థంగా మారిపోయింది. 
 
ఈ నేపథ్యంలో ఆఫ్రికాలోని గినియా దేశంలో సైనిక తిరుగుబాటు మొదలైంది. గినియా దేశాధ్యక్షుడు అల్ఫా కోంటేని సైనికులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ ఆర్మీ కల్నల్ మామాడి డౌంబౌయా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రద్దు చేసినట్టు తెలిపారు. 
 
ప్రజారంజకమైన పాలనను అందిస్తామని చెప్పారు. సోమవారం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరోవైపు సైనిక తిరుగుబాటుని అమెరికా తప్పుపట్టింది. ప్రజాస్వామ్యానికి ఇది విరుద్ధమని వ్యాఖ్యానించింది.