శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 25 మే 2017 (11:43 IST)

ఉపాధి కోసం భర్త గల్ఫ్‌కు వెళ్తే.. భార్య కానిస్టేబుల్‌తో ప్రేమాయణం మొదలెట్టింది.. భర్త ఏం చేశాడంటే?

ఉపాధి కోసం భర్త గల్ఫ్‌కు వెళ్తే.. భార్య కానిస్టేబుల్‌తో ప్రేమాయణం మొదలెట్టింది. ఈ ప్రేమాయణం ఎంతవరకు వచ్చిందంటే.. గల్ఫ్ నుంచి భర్త ఇంటికొచ్చినా పట్టించుకోకుండా లెక్కచేయనంత. భార్యకు భర్త వార్నింగ్ ఇచ్చి

ఉపాధి కోసం భర్త గల్ఫ్‌కు వెళ్తే.. భార్య కానిస్టేబుల్‌తో ప్రేమాయణం మొదలెట్టింది. ఈ ప్రేమాయణం ఎంతవరకు వచ్చిందంటే.. గల్ఫ్ నుంచి భర్త ఇంటికొచ్చినా పట్టించుకోకుండా లెక్కచేయనంత. భార్యకు భర్త వార్నింగ్ ఇచ్చినా.. కానిస్టేబుల్‌తో ఆమె చెట్టాపట్టాలేసుకుని తిరిగేది. ఆమె ఏమాత్రం పట్టించుకోకపోవడంతో భార్యపై.. గల్ఫ్ భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాలోని చిన్నమండెం మండలం కేశాపురం దేవలంపేటకు చెందిన హసనాపురం రామాంజులు భార్య సుజాత.. రెండేళ్ళ కుమార్తెను వదిలి గల్ఫ్‌కు వెళ్లాడు. కరువు కారణంగా ఉపాధిలేకపోవడంతో రామాంజులు గల్ఫ్‌కు వెళ్లాల్సి వచ్చింది. గల్ఫ్‌కు వెళ్ళిన రెండేళ్ళకు ఓసారి రామాంజులు స్వంత ఇంటికి తిరిగివచ్చేవాడు. అయితే తొలుత రెండేళ్ళపాటు ఆయన భార్య బాగానే ఉంది. అయితే రెండేళ్లయ్యాక.. సుజాతకు చిన్నమండెం స్టేషన్‌లోని పనిచేస్తున్న కానిస్టేబుల్‌ రామాంజినేయులతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. 
 
ఈ నేపథ్యంలో ఐదేళ్ల క్రితం గల్ఫ్‌కు వెళ్ళిన రామాంజులు మూడు మాసాల క్రితం గల్ప్ నుండి కడపకు తిరిగివచ్చాడు. అయితే సుజాతతో కానిస్టేబుల్ రామాంజనేయులు ప్రేమాయణం వ్యవహారాన్ని స్థానికులు రామాంజులుకు చెప్పారు. ఈ విషయమై ఆయన భార్య సుజాతను నిలదీశాడు. సుజాత పట్టించుకోలేదు. కానిస్టేబుల్‌ను హెచ్చరించినా ఫలితం లేకపోయింది. దీంతో రామాంజులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పై అధికారుల ఆదేశాల మేరకు కానిస్టేబుల్ రామాంజినేయులుపై కేసు నమోదు చేశారు.