శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 30 జనవరి 2024 (15:30 IST)

ఇమ్రాన్‌ ఖాన్‌కు తేరుకోలేని షాక్.. పదేళ్ల జైలుశిక్ష!!

imran khan
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, ఆ దేశ క్రికెట్ లెజెండ్ ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిఫెర్ కేసులో ఆయనకు పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఇదే కేసులో పాక్ విదేశాంగ మాజీ మంత్రి షా మహ్మద్ ఖురేషీకి కూడా ఇదే తరహా జైలుశిక్షను విధించింది. గతంలో ఈ కేసును ఓ జోక్‌గా ఇమ్రాన్ ఖాన్ కొట్టిపారేయడం గమనార్హం. ఇపుడు ఇదే కేసులో ఆయన పదేళ్ల జైలుశిక్ష పడటం గమనార్హం. దీనిపై ఇమ్రాన్ ఖాన్ న్యాయవాది నయీం పంజుతా స్పందించారు. ఈ తీర్పును తాము అంగీకరించబోమన్నారు. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేశారన్న అభియోగాలపై ఇమ్రాన్ ఖాన్ చాలా రోజులుగా అభియోగాలతో పాటు విచారణను ఎదుర్కొంటున్నారు. దీంతో పాకిస్థాన్‌లో ఈ కేసు సైఫర్ కేసుగా ప్రసిద్ధికెక్కింది. 
 
గతయేడాది అమెరికాలోని పాక్ దౌత్య కార్యాలయంలో ఓ రహస్య కేబుల్‌ని పాక్ ప్రభుత్వానికి పంపించింద. ఈ కేబుల్‌ను ఇమ్రాన్ ఖాన్ బహిర్గతం చేశారన్నది సిఫెర్ కేసులో ప్రధాన అభియోగం. అధికర రహస్యాల చట్టం కింద ఈ కేసు విచారణ జరిగింది. ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీలు రావల్పిండిలోని అడియాలో జైలులో ఉన్నారు. ఇది హై సెక్యూరిటీ కారాగారం. 
 
కాగా, లండన్‌లోని కొందరు వ్యక్తుల పక్కా ప్రణాళికతో ఈ తంతు నడిపించారని, ఈ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో తనకు ముందే తెలుసని ఇమ్రాన్ అప్పట్లోనే సంచలన ఆరోపణలు చేశారు. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ వంటిదేనని చెప్పారు. కాగా, మంగళవారం ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇమ్రాన్ ఖాన్ న్యాయవాది పైకోర్టులో అప్పీల్ చేసినట్టు సమాచారం.