Iran: సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఇద్దరు జడ్జిలపై కాల్పులు.. మృతి
టెహ్రాన్‌లోని ఇరాన్ సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన సాయుధ దాడిలో ఇద్దరు న్యాయమూర్తులు మరణించారు. దుండగుడు కాల్పులు జరిపాడని, ప్రముఖ న్యాయమూర్తులు మొహమ్మద్ మోగిషు, హోజతోలెస్లామ్ అలీ రైజీ మరణించారని తెలుస్తోంది. మరో న్యాయమూర్తి గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ కాల్పుల్లో ఒక బాడీ గార్డు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ దాడి చేసిన తర్వాత, తుపాకీదారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు గల కారణాలు అస్పష్టంగానే వున్నాయి. దర్యాప్తు జరుగుతోంది.
కానీ ఈ ఇద్దరు న్యాయమూర్తులు 1980ల నుండి ఇస్లామిక్ ప్రభుత్వ వ్యతిరేకులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారని టాక్. మృతులైన న్యాయమూర్తులు దశాబ్దాలుగా న్యాయవ్యవస్థలో ఉన్నారు. సుప్రీంకోర్టులో, వారి బాధ్యతలలో మరణశిక్షలను నిర్ధారించడం కూడా జరిగింది.