ఆదివారం, 19 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 18 జనవరి 2025 (17:59 IST)

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..రిలీజ్

Kiran Abbavaram, Rukshar Dhillon
Kiran Abbavaram, Rukshar Dhillon
హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా". ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. "దిల్ రూబా" చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. "దిల్ రూబా" సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
 
ఈ రోజు "దిల్ రూబా" సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'అగ్గిపుల్లె..' రిలీజ్ చేశారు మేకర్స్. 'అగ్గిపుల్లె..' లిరికల్ సాంగ్ ఎలా ఉందో చూస్తే ...' అగ్గిపుల్లె అలా గీసినట్టు, కోపంగా చూడకే కొట్టినట్టు, గాలి దుమారమే రేగినట్టు, ఆవేశమెందుకే నొక్కిపెట్టు...' అంటూ బ్యూటిఫుల్ మెలొడీతో సాగుతుందీ పాట. కిరణ్ అబ్బవరం, సామ్ సీఎస్ కాంబినేషన్ లో వచ్చిన "క" మూవీ సాంగ్స్ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలో "దిల్ రూబా" ఆడియో మీద హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.