శనివారం, 22 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జనవరి 2025 (13:50 IST)

Chiranjeevi: డియర్ తమన్ నీ మాటలు హృదయాన్ని తాకేలా వున్నాయ్: చిరంజీవి

Chiru_thaman
Chiru_thaman
డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో హీరో బాలకృష్ణ నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించగా.. తమన్ అందించిన మ్యూజిక్ హైలెట్ అయ్యింది. ఈ వేడుకలో తమన్ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ నెగిటివిటీ సినిమాపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రోలర్స్‌ని చూస్తుంటే భయంగా సిగ్గుగా ఉంది. 
 
నెగిటివ్ ట్రోల్స్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు పోతుంది. ప్రతి హీరో ఎంతో కష్టపడుతున్నారు. ప్రతి హీరో ఫ్యాన్ కి ఎంతో బాధ్యత ఉంది. నెగిటివిటీని స్ప్రెడ్ చేయొద్దు. తెలుగు సినిమాకి ఇతర భాషల్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఎంతో గౌరవం ఉంది. ట్రోల్స్‌తో మన పరువుని మనమే తీసుకోవద్దని తమన్ కామెంట్స్ చేశారు.
 
తాజాగా తమన్ కామెంట్స్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. "డియర్ తమన్.. నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా  అనిపించింది.
 
కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, Words can inspire. And Words can destroy. Choose what you wish to do. మనం పాజిటివ్‌గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్‌గా ముందుకు  నడిపిస్తుంది" అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.