శనివారం, 18 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 18 జనవరి 2025 (13:52 IST)

జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలతో నేను హర్ట్ అయ్యా, వదిలిపెట్టను: నటి మాధవీ లత

Madhavi Latha
తెదేపా సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి రాంగ్ పర్సన్‌తో పెట్టుకున్నారని నటి, భాజపా నాయకురాలు మాధవీ లత అన్నారు. సినిమా రంగంలో పనిచేస్తున్న మహిళలను ప్రభాకర్ రెడ్డి అవమానించే విధంగా మాట్లాడారనీ, నేను కూడా రాయలసీమ గడ్డ మీదనే పుట్టి, రాగి సంగటి, నాటు కోడి తినే పెరిగాను కనుక నాక్కూడా పౌరుషం వుందని మాధవీ లత అన్నారు. ఐతే అలాగని నేను మొరటుగా వ్యవహరించననీ, నేను చదువుకున్న దాన్ని కాబట్టి న్యాయపరంగా ముందుకు వెళ్తానంటూ వెల్లడించారు.
 
జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నన్ను రాజకీయ పరంగానూ, సినిమా పరంగానూ తిట్టారు. నేనేమీ బ్రతుకుదెరువు కోసం సినిమా ఇండస్ట్రీకి రాలేదు. సినిమాల్లో నటించాలనే ఇష్టంతో వచ్చాను. నాకు అది సెట్ కాలేదు కాబట్టి ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నా. నాపైన లేనిపోని వ్యాఖ్యలు చేసిన జేసీని ఖచ్చితంగా న్యాయపరంగా ఎదుర్కొంటానంటూ చెప్పుకొచ్చారు మాధవీలత.