ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2024 (11:59 IST)

మీడియా ఓవరాక్షన్, చిరు బాధపడ్డారు, మోహన్ బాబు కుమ్మేశారు (video)

Mohan Babu-Chiranjeevi
సీనియర్ నటుడు మోహన్ బాబు తన అనుమతి లేకుండా తన ఇంటి వద్ద గేటు లోపలికి వచ్చి తనను చికాకు పెట్టిన వారి మైకు లాక్కుని దాడి చేసారు. అందరినీ ఇంటి నుంచి గేటు బైటకి తరిమి తరిమి కొట్టారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమస్యల్లోకి దూరడం ఏంటంటూ ప్రశ్నించారు. ఐతే మీడియా పట్ల మోహన్ బాబు ప్రవర్తించిన తీరుపై జర్నలిస్టులు ఆందోళనకు దిగారు.
 
ఇదిలావుంటే మెగాస్టార్ చిరంజీవి తనకు జరిగిన సంఘటన గురించి నెమరేసుకున్నారు. ప్రజాయాత్ర చేస్తున్నప్పుడు నా వెనుకే మీడియావారు అనుసరిస్తున్నారు. ఇంతలో నా అభిమాని ఒకరు డేట్స్ తినమంటూ నాకు ఇవ్వబోయాడు. ఒక్క నిమిషం ఆగమని చెప్పి శానిటైజర్ తో చేతులు కడుక్కుని వాటిని తీసుకున్నాను. ఆ తర్వాత అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చాను.
 
ఐతే ప్రత్యేకించి 3 చానళ్లు మాత్రం నేను డేట్స్ తీసుకున్నవన్నీ ఎడిట్ చేసేసి నా అభిమానికి షేక్ హ్యాండ్ ఇచ్చినది, శానిటైజర్ తో చేతులు కడుక్కోవడం చూపిస్తూ... అభిమానులంటే చిరంజీవికి ఇంత అస్పృస్యతా అంటూ టీవీల్లో చూపించారు. ఇప్పుడు చూపించండి మీకు ప్రజలే సమాధానం చెబుతారు అంటూ 12 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని చెప్పారు.