Sai Pallavi Loses Cool: తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తా... అభిమన్యు లవ్‌లో సాయిపల్లవి!
అమరన్ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామాయణం సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఎంతో కూల్‌గా వుండే సాయిపల్లవి.. ఎక్స్ ద్వారా కోపంతో ఊగిపోయింది. సోషల్ మీడియా హ్యాండిల్‌పై మొదటిసారి తన కోపాన్ని వ్యక్తం చేసింది.
సాయి పల్లవి రామాయణం భక్తిరస చిత్రంలో నటిస్తున్నందున, ఆమె శాఖాహారం తినడానికి ఇష్టపడుతుందని హోటళ్లలో తినడం మానేస్తుందని ఇటీవల ఓ మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది. ఆమె వివిధ దేశాలకు వెళ్లేటప్పుడు చెఫ్‌ల బృందాన్ని తీసుకువెళుతుందని, తద్వారా ఆమె శాఖాహారం మాత్రమే తింటుందని మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి.
ఈ వార్తలపై సాయి పల్లవి తన కూల్‌ను కోల్పోయింది. తన ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్‌ను పోస్ట్ చేసింది. సినిమా విడుదల, లేదా ప్రకటనల సమయంలో తనపై నిరాధారమైన పుకార్లు వచ్చినప్పుడు చాలాసార్లు తనను తాను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తానని ఆమె ట్వీట్‌లో పేర్కొంది.
ఇక నుంచి ఏదైనా పేరున్న మీడియా లేదా పేజీ తనపై తప్పుడు పుకార్లు పెడితే మౌనంగా ఉండబోనని, ఒకవేళ అలా జరిగితే చట్టపరంగా ఎదుర్కొంటానని సాయిపల్లవి వార్నింగ్ ఇచ్చింది. సాయి పల్లవి బహిరంగ వేదికపై ఇలా మీడియాకు వార్నింగ్ ఇవ్వడం ఇదే తొలిసారి. దీనిని అనుసరించి, సోషల్ మీడియాలో చాలా మంది సాయి పల్లవికి తమ మద్దతును చూపారు.
మరోవైపు తాజా ఇంటర్వ్యూలో మహాభారతంలోని అభిమన్యు క్యారెక్టర్ అంటే తనకు చాలా ఇష్టమని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. దాదాపు పదేళ్ల ముందు తాను మొదటిసారి మహాభారతం చదివినప్పుడు అభిమన్యు క్యారెక్టర్‌తో లవ్‌లో పడిపోయానని చెప్పింది సాయిపల్లవి. మొత్తం మహాభారతంలో అభిమన్యు క్యారెక్టర్ అంటే సాయి పల్లవికి చాలా ఇష్టమట. తన జీవితంలో చాలా విషయాలు అభిమన్యు క్యారెక్టర్ ఇన్స్‌పిరేషన్‌గా తీసుకుని నేర్చుకుందట. ఇప్పటికీ ఆ క్యారెక్టర్‌ను అదే స్థాయిలో ఇష్టపడుతోందట సాయిపల్లవి.
ఇంత ఫాస్ట్ అండ్ ఫ్యాషన్ జెనరేషన్‌లో కూడా మహాభారత కాలం నాటి క్యారెక్టర్‌ను అడ్మైర్ చేస్తోంది అంటే.. నిజంగానే సాయి పల్లవి చాలా గ్రేట్ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు ఆమె అభిమానులు.