సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2024 (13:37 IST)

ప్రభాస్‌పై అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం కాకపోవచ్చు : పూనమ్ ధిల్లాన్

poonam dhillon
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కామెంట్స్‌పై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు రీసెంట్‌గా లేఖ రూపంలో స్పందించిన విషయం తెలిసిందే. ప్రభాస్‌పై అర్షద్ చేసిన కామెంట్స్ తెలుగు వారి మనోభావాలను దెబ్బతీశాయని సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షురాలు పూనమ్ ధిల్లాన్‌కు విష్ణు లేఖ రాశారు. భవిష్యత్తులో ఇలాంటి కామెంట్స్ రీపీట్ కాకుండా చూడాలని కోరారు. 
 
ఇప్పుడు ఈ విషయంపై సీఐఎన్‌టీఏఏ (సింటా) అధ్యక్షురాలు పూనమ్ ధిల్లాన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. అర్షద్ చేసిన వ్యాఖ్యలు.. మూవీలోని ప్రభాస్ రోల్‌కు సంబంధించిన అయి ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. పర్సనల్‌గా ఆయనపై చేసిన కామెంట్స్ కాకపోవచ్చని అన్నారు. అయినా అర్షద్ వార్సీ నుంచి అభిప్రాయాన్ని కోరుతున్నామని తెలిపారు. 
 
ఇది ఖచ్చితంగా తెలుగు పరిశ్రమలో కొంత అసహనాన్ని సృష్టించిన విషయమని పూనమ్ ధిల్లాన్ అన్నారు. సినిమా పరిశ్రమలు ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని ఆమె ప్రస్తావించారు. టాలీవుడ్‌కు చెందిన బాధాకరమైన భావాలను చక్కదిద్దడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మనమంతా ఒకే పరిశ్రమ అని గుర్తు చేశారు. అదేసమయంలో ప్రభాస్ గురించి కూడా మాట్లాడారు. ఇండస్ట్రీలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో ప్రభాస్ ఒకరని కొనియాడారు. అలాంటి వ్యక్తి పట్ల వార్సీ బాధపెట్టే వ్యాఖ్యలు చేయరని నమ్ముతున్నామని.. అయినా అర్షద్ వివరణకు తీసుకుంటామని తెలిపారు.