మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జనవరి 2025 (11:08 IST)

నటి మాధవీలత క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి

jc prabhakar reddy
సినీ నటి, బీజేపీ మహిళా నేత మాధవీలతను ఉద్దేసించి టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. ఆవేశంలో అలా మాట్లాడానని, అందువల్ల ఆమెకు క్షమాపణలు చెపుతున్నట్టు చెప్పారు. జేసీ కాస్త తీవ్ర స్థాయిలో స్పందించి మాధవీలతను వ్యభిచారి అని సంబోధించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి కాస్త వెనక్కి తగ్గారు. 
 
మాధవీలతపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని, నోరు జారానని అంగీకరించారు. మాధవీలతపై తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని నోరు జారానని అంగీకరించారు. మాధవీలతకు క్షమాపణలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. 
 
తాడిపత్రిలో మహిళల కోసం న్యూ ఇయర్ రోజున జేసీ పార్కులో సెలెబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. అయితే, జేసీ పార్క్‌కు మహిళలు వెళ్లొద్దని, అక్కడి అరాచక శక్తుల వల్ల మహిళల అపాయం కలిగొచ్చని మాధవీలత వ్యాఖ్యానించారు. దాంతో జేసీ భగ్గుమన్నారు. మాధవీలతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.