శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 సెప్టెంబరు 2024 (10:54 IST)

రీల్స్ వల్ల వచ్చే లాభం ఏంటి? గణేష్ మండపాలకు చలాన్లు ఎందుకు? మాధవీలత (video)

Madhavi Latha
Madhavi Latha
హేమ కమిటీ నివేదిక తర్వాత స్టార్ హీరోయిన్ సమంత వంటి వారు టాలీవుడ్‌లో అలాంటి కమీషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో కో ఆర్డినేటర్‌ల వద్ద అమ్మాయిలది కుక్క బతుకేనని, రూ.500 కోసం వాళ్లు ఎంతో కష్టపడతారని ఆమె తెలిపారు. 
 
జూనియర్ ఆర్టిస్టుల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు అందరూ ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మాధవీలత చెప్పింది. ఈ మధ్యకాలంలో కొంతమంది అమ్మాయిలు విపరీతంగా ఎక్స్‌పోజ్ చేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ పెడుతున్నారని మాధవీలత ఫైర్ అయ్యింది. దీని వల్ల ఎవరికీ , కనీసం ఆ అమ్మాయిలకు కూడా యూజ్ ఉండదని .. ఫ్రాంక్స్ చేసేవాళ్లు, రోడ్ల మీద తిరిగేవాళ్లకే ఇవి పనికొస్తాయని మాధవీలత చెప్పారు. 
 
పనిలో పనిగా వినాయక చవితి ఉత్సవాల కోసం భారీగా ఖర్చుపెట్టే అంశంపై కూడా మాధవీలత సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఏపీ హోంమంత్రి అనితపై నటి, బీజేపీ నేత మాధవీలత ఫైర్ అయ్యారు. గణేష్ మండపాలకు చలాన్లు ఎందుకు చెల్లించాలో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇతర మతాల వారికీ ఇలాగే చలాన్లు విధించే దమ్ముందా? అని ప్రశ్నించారు.
 
“ఏపీలో వినాయక మండపాలకు చలానాలు ఇవ్వడం దారుణం. కూటమిలో ప్రభుత్వంలో మా పార్టీ ఉన్నప్పటికీ తప్పును ఖండిస్తా. ప్రతి వాళ్లకూ హిందూ పండగలపై పడి ఏడవడం తప్ప పనిలేదా? మైక్ పర్మిషన్ కు రూ.100, విగ్రహాలకు రూ.350 ఇవ్వాలా? ఇదేంటని అడిగితే పర్యావరణ పరిరక్షణ అంటూ కొత్త కథలు చెప్తారు...అంటూ తీవ్రస్థాయిలో మాధవీలత తెలిపారు.
 
తొమ్మిది రోజుల పాటు వినాయక మండపాల దగ్గర మైకులు పెట్టుకుంటే చలాన్లు కట్టాలన్న ప్రభుత్వం, రోజూ నాలుగు సార్లు నమాజ్ చేసే ముస్లీంలకు, అర్థరాత్రి వరకు మైకులు పెట్టి గోల చేసే క్రిస్టియన్లకు చలానాలు విధించే దమ్ముందా?" అంటూ నిలదీశారు.    
వినాయక విగ్రహాల కారణంగానే భూమ్మీద మొత్తం కాలుష్యం అవుతున్నట్లు కొన్ని బ్యాచ్ లు ప్రచారం చేస్తాయి. అమాయకపు అమ్మాయిలపై అత్యాచారం చేసి చంపిన ఉన్మాదులకు మరణశిక్ష విధిస్తే మానవహక్కుల ఉల్లంఘణ అంటూ వచ్చే బ్యాచ్‌లు, వినాయక విగ్రహాలతో కాలుష్యం అవుతుందని చెప్పే గుంపులు ఒకటే అంటూ మాధవీలత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
జగన్ ప్రభుత్వ జీవోలో మండపాలక తప్ప, విగ్రహాలకు అడుగులు చొప్పున డబ్బులు లేవు, మైకులకి డబ్బుల్లేవు, ఇలా అడుగు చొప్పున అడుగడుగుకి విగ్రహాలకి విచ్చలవిడిగా డబ్బులు తీసుకోవడం ఎందుకు.. ఇవి కొత్త రూల్స్ మాత్రమే.. అంటూ మాధవీలత తీవ్రస్థాయిలో మండిపడ్డారు.