సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 జులై 2024 (13:31 IST)

తప్పుడు లెక్కలు.. కేసు పెడితే ఏం చేస్తావ్.. సీఎం కుర్చీ కోసం బాబాయ్‌నే: అనిత (video)

Anitha
ఏపీలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై హోం మంత్రిపై వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న అనితపై ఎందుకు కేసు పెట్టకూడదని ప్రశ్నించారు. తప్పుడు లెక్కలతో జగన్ అసత్యాలు చెప్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఏది చెప్పినా ప్రజలు నమ్మేస్తారనే ఆలోచనలో జగన్ వున్నారని.. ఏపీలో సర్కారుపై బురద చల్లాలని జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు హోం మంత్రి మండిపడ్డారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక నాలుగే రాజకీయ హత్యలు జరిగాయని, మృతి చెందిన వారిలో ముగ్గురు తెదేపా కార్యకర్తలేనని స్పష్టం చేశారు. వీరిని వైకాపా నాయకులే చంపారన్నారు.
 
జనాలను భయపెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని.. అవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. గతంలో వైకాపా సర్కారుపై చిన్న పోస్టు పెట్టారని రంగనాయకమ్మను, గౌతు శిరీషను వేధించారు. చింతకాయల విజయ్‌ని ఇబ్బందిపెట్టారు. చాలామందిపై తప్పుడు కేసులు పెట్టారు. వారంతా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అనిత వెల్లడించారు.
 
ప్రస్తుతం తమ సర్కారుపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్న జగన్‌పై ఎందుకు కేసు పెట్టకూడదని అనిత ప్రశ్నించారు. వైకాపా హయాంలో మాజీ మంత్రి వివేకా హత్య, చంద్రబాబు నివాసం, తెదేపా నేతలపై చేసిన దాడులపై కూడా ఢిల్లీలో చెప్తారా అంటూ జగన్‌ను నిలదీశారు. గులకరాయి డ్రామాతో మళ్లీ సీఎం కావాలని జగన్ చూశారని.. సీఎం కుర్చీ కోసం సొంత బాబాయిని చంపి.. కోడి కత్తి కేసులో దళితుడిని ఇరికించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం కోల్పోవడంతో పులివెందుల ఎమ్మెల్యే అడ్డదారి తొక్కైనా సీఎం కావాలని కలలు కంటున్నారని అనిత ఎద్దేవా చేశారు.