1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 మే 2021 (11:54 IST)

పాలస్తీనా - ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు.. దాడుల్లో 72 మంది మృతి

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై హమాస్‌ ఉగ్రవాదులు రాకెట్లతో దాడులకు పాల్పతుండగా.. ఇజ్రాయెల్‌ గాజాపై వైమానిక దాడులకు దిగుతోంది. ఇరువర్గాల దాడులతో ఇప్పటి వరకు గాజాలో 65 మంది మృతి చెందగా.. ఇజ్రాయెల్‌లో ఏడుగురు మృతి చెందారు. 
 
గాజా స్ట్రిప్‌పై భారీ బాంబుదాడులు కొనసాగుతున్నాయని, ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో సీనియర్‌ సభ్యులతో పాటు గాజా సిటీ కమాండ్‌ బస్సెం ఇస్సా మృతి చెందాడని హమాస్‌ ధ్రువీకరించింది. గాజాలో మరణించిన వారిలో 16 మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు సహా 65 పాలస్తీనియన్లు మృతి చెందారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 86 మంది పిల్లలు, 39 మంది మహిళలు సహా 365 మంది గాయపడ్డారని పేర్కొంది.
 
ఇదిలావుంటే, టెల్‌ అవీవ్‌ మెట్రో పాలిటన్‌ ప్రాంతం, దక్షిణాది నగరాల్లో బుధవారం రాత్రి హమాస్‌ రాకెట్లతో దాడులకు దిగడంతో ఐదేళ్ల బాలుడు మృతి చెందగా.. కనీసం 20 మంది ఇజ్రాయిలీలు గాయపడ్డారు. ఓ రాకెట్‌ ఇంటి కిటికీలో నుంచి దూసుకువచ్చి బాలుడితో పాటు అతని తల్లిని గాయపరిచింది. తీవ్రంగా గాయపడడంతో బాలుడు మృతి చెందారు. 
 
అలాగే, గాజా సరిహద్దులో ఐదుగురు ఇజ్రాయెల్ పౌరులు, ఓ భారతీయుడు, మరో ఐడీఎఫ్‌ సైనికుడు మరణించాడు. ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకారం.. బుధవారం ఉదయం 6 గంటల నుంచి ఇజ్రయెల్‌పై 180 ప్రయోగించారని, ఇందులో 40 గాజాలోనే పడిపోయాయని పేర్కొంది. హమాస్‌ దాడులకు ప్రతిగా ఐడీఎఫ్‌ గాజా ప్రాంతంలో 500 లక్ష్యాలపై దాడులు చేసినట్లు తెలిపింది.