మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 డిశెంబరు 2021 (12:43 IST)

సంగీత శిక్షణ పేరుతో చిన్నారులపై అఘాయిత్యం... ఫోనులో నీలి చిత్రాలు

ఇటలీలో ఓ దారుణం వెలుగు చూసింది. ఓ మ్యూజిక్ టీచర్ సంగీత శిక్షణ పేరుతో పలువురు విద్యార్థినిలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పైగా, అతని ఫోను నిండా పోర్న్ వీడియోలను పోలీసులు గుర్తించారు.  
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటలీ దేశంలోని మార్చే రీజియన్‌లోని అంకోనా అనే పట్టణంలో ఓ సంగీతకారుడు చిన్నారులకు సంగీతం నేర్పుతూ వచ్చాడు. ఈ నెపంతో పలువురు విద్యార్థినులపై అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతని ఇంటిలో ఆకస్మిక సోదాలు జరిపారు. ఈ సోదాల్లో నీలి చిత్రాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు లభ్యమయ్యాయి. 49 యేళ్ళున్న ఆ కామాంధ టీచర్... 30 యేళ్ళ వయస్సు నుంచే ఈ పాడు పనులకు పాల్పడుతూ వస్తున్నట్టు విచారణలో తేలింది. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.