1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (12:49 IST)

'కటి' ప్రదేశంలో బంగారం పేస్ట్ దాచి అక్రమ రవాణా

ఒక వ్యక్తి బంగారాన్ని పేస్ట్‌గా చేసి మలం (కటి) ప్రాంతంలో అక్రమ రవాణా చేస్తూ పట్టుబట్టాడు. ఈ ఘటన ఇంఫాల్ విమానాశ్రయంలో జరిగింది. సుమారు 900 గ్రాముల గోల్డ్ పేస్ట్‌ను ఆ వ్య‌క్తి త‌న మ‌లాశ‌యంలో దాచిన‌ట్లు అధికారులు గుర్తించారు. ఈ బంగారం విలువు సుమారు 42 ల‌క్ష‌లు ఉంటుంద‌ని సీఐఎస్ఎఫ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 
 
మొత్తం నాలుగు గోల్డ్ పేస్ట్ ప్యాకెట్లు ఉన్నాయ‌ని, వాటి బ‌రువు 90.68 గ్రాములు ఉంటుంద‌ని సీఐఎస్ఎఫ్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ బీ దిల్లి తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్ చేస్తున్న స‌మ‌యంలో మలాశ‌యం వ‌ద్ద మెట‌ల్ ఉన్న‌ట్లు గుర్తించామ‌ని, మొహ‌మ్మ‌ద్ ష‌రీఫ్ అనే ప్యాసింజెర్‌ను ఈ కేసులో అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు. 
 
కేర‌ళ‌లోని కోచికోడ్‌కు చెందిన అత‌ను ఇంపాల్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో వెళ్లాల్సి ఉంది. త‌నిఖీ స‌మ‌యంలో వేసిన ప్ర‌శ్న‌ల‌కు అత‌ను స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేదు. దీంతో మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్ రూమ్‌లో అత‌నికి ఎక్స్ రే తీశారు. ఎక్స్ రే రిపోర్ట్ ప్ర‌కారం అత‌ని శ‌రీర మ‌లాశ‌య భాగంలో లోహం ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఆ త‌ర్వాత ఆ ప్యాసింజెర్ గోల్డ్ పేస్ట్ ఉన్న‌ట్లు అంగీక‌రించాడు.