మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (23:36 IST)

విడాకులపై క్లారిటీ ఇచ్చిన సమంత - హైదరాబాద్ నా ఇల్లు అంటూ.. (Video)

భర్త నాగ చైతన్యకు తనకు మధ్య మనస్పర్థలు తలెత్తి విడాకుల వరకు దారితీసినట్టు వస్తున్న వార్తలపై హీరోయిన్ సమంత స్పందించారు. ఈ వార్తల్లో అణుమాత్రం కూడా నిజం లేదని స్పష్టం చేశారు. 
 
గత కొద్దీ రోజులుగా సమంత విడాకులు తీసుకోబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవ‌ల తన దుస్తుల బ్రాండ్ ‘సాకి’ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత సోషల్‌ మీడియాలో అభిమానులతో చాట్‌ చేసింది. 
 
నన్ను ఏం అడగాలనుకుంటున్నారో రెడీ అవ్వండి అని ముందే అభిమానులకు తెలిపింది. దాంతో ఫాలోయర్స్ పెద్ద సంఖ్యలో ఆమెతో మాట్లాడేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలోనే ఆమె అభిమాని ఒకరు 'మీరు నిజంగా ముంబైకి వెళ్తున్నారా?' అని ప్రశ్నించారు.
 
ఆ ప్రశ్నకు సామ్.. సమాధానం ఇచ్చింది. తాను ఎక్కడికీ వెళ్లనని, హైదరాబాద్ తన ఇల్లు అని క్లారిటీ ఇచ్చింది. తాము విడిపోతున్న‌మ‌నే పుకారు ఎక్కడ మొదలైందో.. నిజంగా తెలియదని ఎమోష‌న‌ల్ అయ్యారు. 
 
అదోక రూమర్ అని.. ఇందులో వాస్త‌వం లేద‌ని, ఎప్ప‌టికీ హైదరాబాదే నా ఇల్లు.. హైదరాబాద్ నాకు అన్నీ ఇస్తోంది, తాను ఇక్కడే ఉంటానని అని పుకార్లు చెక్ పెట్టింది. ఈ సమాధానాలతో అభిమానులు ఫుల్ హ్యాపీ అవుతున్నారు.