గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (09:48 IST)

ఓవర్సీస్‌లో రికార్డులు తరగరాస్తున్న "లవ్‌స్టోరీ"

అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం "లవ్‌స్టోరీ". ఈ నెల 24వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం మంచి టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ఈ చిత్రం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సరికొత్త రికార్డులను తిరగరాస్తుంది.
 
అమెరికాలో 'ల‌వ్‌స్టోరీ' విడుద‌లైన 3 రోజుల్లోనే 1 మిలియ‌న్ డాల‌ర్ల (రూ.7 కోట్ల 37 ల‌క్ష‌లు) వసూళ్లు రాబట్టింది. ఆదివారం రాత్రి వ‌ర‌కు 2021లో అత్య‌ధిక గ్రాస్ సాధించిన తెలుగు సినిమాగా ల‌వ్‌స్టోరీ నిలిచింది.
 
కరోనా రెండో దశ వ్యాప్తి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా 'లవ్‌స్టోరీ' నిలిచింది. మూడు రోజుల్లో యూఎస్‌లో 1 మిలియన్ల డాలర్ల క్ల‌బ్‌లోకి 'లవ్‌స్టోరీ' చేరటం విశేషం. దీంతో ల‌వ్‌స్టోరీ 2 మిలియ‌న్ల డాల‌ర్ల మైల్‌స్టోన్ దిశ‌గా వెళ్ల‌డం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.