శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (10:24 IST)

బన్నీపై వీరాభిమానం .. 160 యేళ్ళ పురాతన గిఫ్టు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఓ వీరాభిమాని తన ప్రత్యేకతను చాటుకున్నారు. 160 యేళ్ళనాటి పురాతన బహుమతిని అందజేశారు. ఓ మల్టీ మిలియనీర్ దుబాయ్‌లో అల్లు అర్జున్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. 
 
కేరళ మూలాలు ఉండి దుబాయ్‌లో స్థిరపడిన మల్టీ మిలియనీర్ రియాజ్ కిల్టన్ యూఏఈలో అల్లు అర్జున్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అల్లు అర్జున్‌కు 160 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పిస్టల్‌ను బహుమానంగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు ఒమర్ లులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 
 
ఒక్క టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్లోనూ ముఖ్యంగా కేరళలో అల్లు అర్జున్ కు విశేష సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మరే టాలీవుడ్ హీరోకూ అక్కడ అంత క్రేజ్ లేదనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.