శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 14 మార్చి 2017 (16:31 IST)

ఇవాంకా ట్రంప్ స్పోర్ట్స్ బిజినెస్.. నోరెత్తని ట్రంప్.. డిజైన్లు కాపీ కొడుతున్నారా?

అమెరికా డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పాపులర మోడల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె సొంతంగా జ్యూయెల్లరీ, హ్యాండ్ బ్యాగ్స్, యాక్సెసరీస్ వంటి సేల్స్ స్టోర్స్ బిజినెస్‌లో ఎంటరైంది. యూఎస్‌తో బాటు మరికొన

అమెరికా డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పాపులర మోడల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె సొంతంగా జ్యూయెల్లరీ, హ్యాండ్ బ్యాగ్స్, యాక్సెసరీస్ వంటి సేల్స్ స్టోర్స్ బిజినెస్‌లో ఎంటరైంది. యూఎస్‌తో బాటు మరికొన్ని దేశాల్లోనూ ఇవాంకా స్టోర్స్ పాపులర్ అయ్యాయి. కానీ ఈ వస్తువుల డిజైనింగ్ ఇతర ప్రఖ్యాత కంపెనీల డిజైన్లను పోలి ఉన్నాయని, దాదాపు వాటిని కాపీ కొట్టినట్టే వున్నాయని విమర్శలు తలెత్తాయి. 
 
పైగా హ్యాండ్ బ్యాగ్స్ కోసం కుందేళ్ళ ఫర్‌ను వినియోగించడంపై జంతు హక్కుల సంఘాలు, పెటా వంటి సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఒకవైపు అమెరికా చీఫ్ డొనాల్డ్ అమెరికన్లకే ఉద్యోగాలంటున్నప్పటికీ.. ఇవాంకా విదేశీ సంస్థలతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నా కిమ్మనడంలేదు. అయితే కొన్ని సంస్థలు మాత్రం ఇవాంకాతో సంబంధాలకు బై బై చెప్పేస్తున్నాయి. అటు రాజకీయాలకు, బిజినెస్‌కు సంబంధం లేదని ట్రంప్ తెగేసి చెప్పేసిన సంగతి తెలిసిందే.