1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 24 మే 2016 (11:14 IST)

జపాన్‌లో దారుణం.. పాప్ స్టార్‌ను 20 సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా చంపేసిన అభిమాని!!

జపాన్లో దారుణం చోటుచేసుకుంది. జపనీస్ పాప్ స్టార్ మయు టొమిటాపై ఓ అభిమాని కత్తితో అతి కిరాతంకంగా దాడిచేశాడు. టొమొహిరొ ల్వజాకి (27) అనే వ్యక్తి కత్తితో 20 సార్లు టొమిటాను పొడిచినట్టు టోక్యో మెట్రోపాలిటన్ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలను పరిశీలిస్తే కొగనీ సిటీలో టొమిటా ప్రదర్వన ఇవ్వాల్సి ఉండగా అక్కడికి వచ్చిన టొమొహిరొ ల్వజాకి టొమిటాని కత్తితో 20 సార్లు దారుణంగా పొడిచాడు. 
 
గతంలో టొమొహిరొ సోషల్ మీడియాలో టొమిటాకు అసభ్యకర మెసేజ్లను పదేపదే పంపేవాడని పోలీసులు చెప్పారు. ఈ విషయంలపై టొమిటా ఇంతకుముందే టొమొహిరోపై టోక్యో మెట్రోపాలిటన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు.
 
ప్రస్తుతం టొమిటా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. టొమిటాపై ఓ అభిమాని కత్తితో విచక్షణరహితంగా దాడిచేయడం అక్కడ పెద్ద దుమారమే రేపింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టొమొహిరొ ల్వజాకి అకస్మాత్తుగా ఆమెపై కత్తితో ఎందుకు దాడి చేశాడో అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.