బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: శనివారం, 22 జూన్ 2024 (21:50 IST)

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

Pop Corn Chicken Recipe
పైల్స్, తెలుగులో మొలలు. ఈ సమస్య వున్నవారి పరిస్థితి చెప్పలేనంత ఇబ్బందికరంగా వుంటుంది. పైల్స్ సమస్యతో బాధపడుతుంటే ఈ క్రింద తెలిపిన 7 ఆహార పదార్థాలకు దూరంగా వుండాలి. వాటిని ఎందుకు దూరం పెట్టాలో తెలుసుకుందాము.
 
పండని అరటిపండ్లు వంటి ఇతర పండ్లను తింటే అవి మొలలు నొప్పి, బాధను పెంచి మలబద్ధకం లేదా చికాకు కలిగించే అవకాశం వుంది.
 
వైట్ రైస్, వైట్ బ్రెడ్, స్టోర్‌లలో కొనుగోలు చేసే కేక్‌లు వంటి శుద్ధి చేసిన ధాన్యాలతో చేసినవి తింటే సమస్య పెరుగుతుంది.
 
శుద్ధిచేసిన మాంసాహారం, ఫాస్ట్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ వంటి వాటికి దూరంగా వుండాలి.
 
పైల్స్ ఇప్పటికే నొప్పులు లేదా రక్తస్రావం కలిగి ఉంటే ఫ్రైడ్ రైస్, పిజ్జా వంటివి తింటే మరింత ఇబ్బందికరంగా ఉంటుంది.
 
మద్యం సేవించడం వల్ల మొలలు సమస్య తీవ్రతరం కావచ్చు కనుక దాన్ని దూరం పెట్టాలి.
 
పాలు, జున్ను, ఇతర పాల ఉత్పత్తులు మొలలు ఇబ్బంది పెడుతున్నప్పుడు తీసుకోకపోవడం మంచిది.
 
గమనిక: వైద్యుడిని సంప్రదించి, పైల్స్ సమస్య పరిష్కరించడానికి ఉత్తమమైన నియమావళిని నిర్ణయించడానికి సలహా తీసుకోవాలి.