గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2019 (17:28 IST)

ఇన్‌స్టాగ్రామ్‌లో సింగర్ జేసన్ ఫోటో ఎందుకు తొలగించారు?

అమెరికన్ సింగర్ జేసన్ డెరూలో ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ సంస్థ తొలగించింది. ఆయన పోస్ట్ చేసిన ఓ ఫొటోను ఒక్క మాటైనా చెప్పకుండా, ఎలాంటి నోటీసులు లేకుండా తొలగించేసింది. జేసన్ చెడ్డీ మాత్రమే వేసుకుని దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ తొలగించేసింది. 
 
ఇందుకు కారణం ఆయన అంగం పెద్దదిగా ఉండటమేనట. ఫొటోలో అంగం అసహ్యంగా కనిపిస్తోందని ఇలాంటి ఫొటోలకు ఇన్‌స్టాగ్రామ్ అనుమతి ఇవ్వదని తెలిపింది. దాంతో జేసన్‌కు ఒళ్లుమండింది. తనకు సహజంగా వచ్చిన అవయవాలపై అభ్యంతరం చెప్పడానికి ఇన్‌స్టాగ్రామ్ ఎవరని ప్రశ్నించారు. జేసన్‌కు ఫ్యాన్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ లభించింది. 
 
సమానత్వంపై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌తో చర్చించడానికి సిద్ధంగానే ఉన్నట్లు జేసన్ తెలిపారు. ఇదే అనుభవం హాలీవుడ్ నటి ఆంబర్ హర్డ్‌కు ఎదురైంది.
 
కొన్ని నెలల క్రితం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో షేర్ చేశారు. ఆ ఫొటోలో ఆంబర్ చెస్ట్, నాభి క్లియర్‌గా కనిపిస్తున్నాయి. దాంతో ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేయకూడదంటూ ఇన్‌స్టాగ్రామ్ హెచ్చరించింది. అంతేకాదు ఆంబర్ అనుమతి లేకుండా ఆ ఫొటోను తొలగించింది.