సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 7 డిశెంబరు 2016 (09:40 IST)

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పారిపోయారు.. అమెరికా సేనల సాయంతో ఊడ్చిపారేశారు..

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను లిబియా ఊడ్చి పారేసింది. అమెరికా సేనల సహాయంతో సిర్టీలోని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల చివరి బేస్‌ క్యాంపుపై విజయవంతంగా లిబియా సేనలు వైమానిక దాడులు నిర్వహించాయి. దీంతో ఆ ప్ర

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను లిబియా ఊడ్చి పారేసింది. అమెరికా సేనల సహాయంతో సిర్టీలోని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల చివరి బేస్‌ క్యాంపుపై విజయవంతంగా లిబియా సేనలు వైమానిక దాడులు నిర్వహించాయి. దీంతో ఆ ప్రాంతంలోని ఉగ్రవాదుల నివాసాలు, బంకర్లు ధ్వంసమయ్యాయి. అక్కడ ఉన్న ఉగ్రవాదులంతా పరారై పోయారు. దీంతో సిర్టీ, గిజి బరియా జిల్లాలపై లిబియా సైన్యం పూర్తి స్థాయిలో పట్టు సంపాధించినట్లయింది.

ఈ దాడులకు ముందు పలువురు మహిళలను, చిన్నపిల్లలను ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. అయితే, దాడులు చేసిన వెంటనే వారిని విడిచిపెట్టి పారిపోయారు. ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి జీన్‌ వెస్‌ లీ డ్రియాన్‌ ఈ సందర్భంగా సైనికులకు అభినందనలు చెప్పారు. 
 
ఈ విజయంతో లిబియా సేనలు అమెరికా సేనలతో కలిసి సంబురాల్లో మునిగిపోయాయి. లిబియా దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తమ వీర జవానుల త్యాగం వృధా కాలేదంటూ సైనికులు నినాదాలు చేశారు. 2015లో సిర్టీలో చొరబడిన ఉగ్రవాదులు అక్కడే తిష్టవేసి ఆ ప్రాంతంపై పట్టు సాధించి ముప్పు తిప్పలు పెట్టారు. ఈ నేపథ్యంలో లిబియా అమెరికా సంయుక్త సేనలు దాడులకు దిగి విజయం సాధించాయి.