మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 10 జులై 2021 (11:11 IST)

ఒంటరితనం భరించలేక జీవితాన్ని ముగించిన పోర్న్ స్టార్

ఆమె పేరొందిన పోర్న్ స్టార్. పేరు క్రిస్టినా లిసీనా. వయసు 29 యేళ్లు. ఊరు రష్యా. డబ్బుతో పాటు పేరు కూడా ఉంది. కానీ, నా అనేవాళ్లే లేకపోయారు. దీంతో ఒంటరిగా జీవిస్తూ వచ్చింది. ఆ ఒంటరితనమే ఆమె జీవితాన్ని అర్థాంతరంగా ముగించేలా చేసింది. ఫలితంగా ఈ పోర్న్ స్టార్ జీవితం విషాదాంతమైంది. ఒంటరితనం భరించలేక సూసైడ్ చేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మంచి బ్యాంకు ఉద్యోగం వదిలేసి ఊహించని రీతిలో పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లిసీనా... పోర్న్ హబ్, ఓన్లీ ఫ్యాన్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. 
 
అయితే అడల్ట్ ఇండస్ట్రీలోకి వెళ్లడంతో అయినవాళ్లందరికీ దూరమైంది. కుటుంబసభ్యులు ఆమెను వెలేశారు. దీంతో అనాథలా మారింది. తిరిగి కుటుంబంతో కలిసే ప్రయత్నం చేసినప్పటికీ కుదరలేదు. ఒంటరితనం వేధించింది. 
 
ఈ క్రమంలో సెయింట్ పీటర్స్ బర్గ్‌లో ఉంటున్న లిసీనా... తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ 22వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఇంటికి వచ్చిన కాసేపటికే ఆత్మహత్య చేసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. 
 
అయితే ఆమె ఆత్మహత్యకు ఒంటరితనమే కారణమని భావిస్తున్నారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఒంటరితనం తన పాలిట శాపమైందని తెలిపింది. గత కొంత కాలం నుండి సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటూ వచ్చిన లిసీనా తనువు చాలించింది.