వారిద్దరు లెస్బియన్స్.. పిల్లలు కావాలని ముచ్చటపడ్డారు.. వారి ఆశ తీరిందా?
మాములుగా స్వలింగ సంపర్కులకు కూడా పిల్లల్ని కనాలని ఆశ ఉంటుంది. దీని కోసం వారు ఐవిఎఫ్ మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ ఓ దంపతులు మాత్రం ఆ మార్గాన్ని వదులుకొని తమ స్నేహితుడి వీర్యాన్ని సిరంజితో ఎక్కించుకొని
మాములుగా స్వలింగ సంపర్కులకు కూడా పిల్లల్ని కనాలని ఆశ ఉంటుంది. దీని కోసం వారు ఐవిఎఫ్ మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ ఓ దంపతులు మాత్రం ఆ మార్గాన్ని వదులుకొని తమ స్నేహితుడి వీర్యాన్ని సిరంజితో ఎక్కించుకొని గర్భం దాల్చారు. నిజానికి ఐవిఎఫ్ మార్గం చాలా డబ్బుతో కూడుకున్న పని. దాంతో డాక్టర్ల సహాయం లేకుండా వారి అంతటా వారే కొన్ని ప్రయత్నాలు చేసి సిరంజితో గర్భం దాల్చారు.
ఆ వివరాల్లోకి వెళితే... బ్రిస్బేన్‌కు చెందిన లెస్బియన్ జంట జేడ్ రిచర్డ్స్ ఆన్‌గార్డ్‌లు తమకు సంతానం కావాలని ముచ్చటపడ్డారు. ఈ క్రమంలో తమ స్నేహితుడి వీర్యాన్ని సిరంజిలో ఎక్కించి గుర్రాలకు వాడే సిరంజితో ఇంజెక్ట్ చేయగా విజయం సాధించి ఆమె గర్భం దాల్చారు. మేమిద్దరం ఆరోగ్యంగా ఉన్నందువల్లే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు వారు తెలిపారు. నిజంగా ఈ పద్ధతిని గుర్రాలకు మాత్రమే వాడుతారట.