భారత పర్యటన కోసం ఆసక్తిగా చూస్తున్నా : ట్రంప్

trump
ఎం| Last Updated: శనివారం, 15 ఫిబ్రవరి 2020 (21:27 IST)
భారత పర్యటనపై తనకు ఉన్న ఆసక్తిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వ్యక్తపరిచారు. ఈసారి ప్రధాని వెూడీకి తనకు మధ్య ఉన్న ఓ కామన్‌ పాయింట్‌ని తెరవిూదరకు తెచ్చారు.

ఫేస్‌బుకలోే ట్రంప్‌ నంబర్‌ వన్‌ అని తర్వాత వెూడీ ఉన్నారని ఆ సంస్థ అధినేత జుకర్‌బర్గ్‌ తనతో చెప్పినట్లు ఈ సందర్భంగా ట్రంప్‌ ఉటంకించారు.

త్వరలో తాను భారత్‌లో పర్యటించబోతున్నానని, దానికోసం ఆసక్తిగా వేచిచూస్తున్నానని వ్యాఖ్యానించారు.”ఫేస్‌బుకలోే డొనాల్డ్‌ ట్రంప్‌ నెంబర్‌ వన్‌ అని, తర్వాత ప్రధాని వెూడీ ఉన్నారని ఇటీవల జుకర్‌బర్గ్‌ అన్నారు.

ఇది గొప్ప గౌరవం అనుకుంటా! నిజానికి, రెండు వారాల్లో నేను భారత్‌కు వెళ్లబోతున్నాను. ఆ పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

భారత్‌లో తొలి పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదుచూస్తున్నానని రెండు రోజుల క్రితమే ట్రంప్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దిల్లీ, అహ్మదాబాద్లో ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్‌ ఆయన సతీమణితో కలిసి పర్యటించనున్నారు.

అహ్మదాబాద్‌లో లక్షలాది మంది ప్రజలు తనకు స్వాగతం చెప్పబోతున్నట్లు వెూడీ తనతో చెప్పారన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కూడా కుదిరే అవకాశం ఉందన్న ఊహాగానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే.
దీనిపై మరింత చదవండి :