శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 16 మార్చి 2017 (16:28 IST)

అదృష్టం కలిసొచ్చింది.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు.. లాటరీతో రూ.2862 కోట్లు!!

అమెరికాలోని ఇండియానాకు చెందిన ఓ వ్యక్తికి అదృష్టం కలిసిరావడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. ఏకంగా 435 మిలియన్ డాలర్లు లాటరీ ద్వారా గెలుచుకున్నాడు. పవర్ బాల్ అనే లాటరీ సంస్థ లాటరీలను విక్రయిస

అమెరికాలోని ఇండియానాకు చెందిన ఓ వ్యక్తికి అదృష్టం కలిసిరావడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. ఏకంగా 435 మిలియన్ డాలర్లు లాటరీ ద్వారా గెలుచుకున్నాడు. పవర్ బాల్ అనే లాటరీ సంస్థ లాటరీలను విక్రయిస్తోంది. ఇలాంటి సంస్థలు ఇండియానా స్టేట్‌లో దాదాపు 30కి మించే వున్నాయి. ఈ నేపథ్యంలో ఓ మాన్యుఫేక్చరింగ్ కంపెనీలో పనిచేసే కార్మికుడికి ఏకంగా 435 మిలియన్ డాలర్లు (రూ.2862 కోట్లు) లాటరీ ద్వారా దక్కాయి. 
 
దీంతో ఈ లాటరీ రికార్డు సాధించింది. అమెరికా లాటరీ చరిత్రలో ఈ లాటరీ అతిపెద్ద 10వ లాటరీగా గుర్తింపు పొందింది. కానీ ఈ లాటరీలో 435 మిలియన్ డాలర్లు గెలుచుకున్న వ్యక్తి తన పేరు, వివరాలను పవర్ బాల్ సంస్థ.. గోప్యంగా ఉంచింది. లాటరీలో భారీ మొత్తం గెలుచుకున్నట్లు సదరు సంస్థ వ్యక్తికి ఫోన్ చేస్తే లైన్ కలవలేదని, దీంతో లాటరీ గెలుచుకున్న సోదరుడికి విషయం చెప్పినట్లు సంస్థ వెల్లడించింది. 
 
ఈ విషయాన్ని తండ్రి, సోదరుడు చెప్పినా... సదరు వ్యక్తి నమ్మలేదని.. డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన అనంతరం అతనికి లాటరీని నిర్వహించిన పవర్ బాల్ సంస్థ పంపిన లేఖ చూపించడంతో లాటరీ గెలిచినట్టు గుర్తించి.. ఎగిరి గంతేశాడని సంస్థ వెల్లడించింది. టాక్స్ పోగా మిగిలిన మొత్తాన్ని కుటుంబం కోసం, కుటుంబ సభ్యుల చదువు కోసం ఉపయోగిస్తానని లాటరీ గెలిచిన వ్యక్తి తెలిపాడు.