ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2019 (14:59 IST)

గొడుగుతో పాటు గాల్లోకి ఎగిరిపోయాడు.. వీడియో

బలంగా ఈదురుగాలులు వచ్చినప్పుడు వస్తువులు గాల్లోకి ఎగరడం మనం చూస్తూనే ఉంటాం..కానీ విచిత్రంగా గాలుల ధాటికి ఓ వ్యక్తి గొడుగుతో పాటు గాల్లోకి ఎగిరిపోయాడు. ఈ ఘటన టర్కీలో చోటు చేసుకుంది. టర్కీలోని ఒస్మానియా ప్రావిన్స్‌కు చెందిన కొందరు వ్యక్తులు స్థానికంగా ఉన్న ఓ హోటల్‌కు వెళ్లారు. ఈ క్రమంలో జోరుగా వీస్తున్న ఎదురుగాలుల తాకిడికి ఆ ప్రదేశం ఒక్కసారిగా ఊగిపోయింది. 
 
దీంతో గాలులను తట్టుకుని నిలబడేందుకు స్టాండ్‌ ఉన్న గొడుగు సాయం తీసుకున్నారు. అయితే తీవ్రమైన గాలుల ధాటికి గొడుగుతోపాటు ఓ వ్యక్తి కూడా పైకి ఎగిరిపోయాడు. నాలుగు మీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత భయంతో కిందకి దూకేసాడు. అదృష్టవశాత్తూ అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ వ్యక్తి సాదిక్‌ కొకడాలిగా గుర్తించారు.