శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 నవంబరు 2016 (08:51 IST)

అరుణ గ్రహంపై అద్భుతం : పొడవైన జుట్టు.. గౌను వేసుకున్న మహిళ.. క్యూరియాసిటీ రోవర్ ఫోటో

అరుణ గ్రహంపై అద్భతం కనిపించింది. ఈ గ్రహంపైకి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్ ఓ మహిళ శరీరాన్ని గుర్తించింది. క్యూరియాసిటీ రోవర్ భూమికి పంపించిన ఫోటోల్లో మహిళ శరీరం స్పష్టం

అరుణ గ్రహంపై అద్భతం కనిపించింది. ఈ గ్రహంపైకి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్ ఓ మహిళ శరీరాన్ని గుర్తించింది. క్యూరియాసిటీ రోవర్ భూమికి పంపించిన ఫోటోల్లో మహిళ శరీరం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. 
 
గత 2012 నుంచి మార్స్‌పై చక్కర్లు కొడుతున్న క్యూరియాసిటీ రోవర్ ఆ గ్రహానికి సంబంధించి కీలకమైన ఫొటోలను పంపిస్తున్న విషయం తెలిసిందే. ఇది భూమికి పంపిన ఫోటోలను యూఎఫ్ఓ హంటర్స్‌కు చెందిన ఏలియన్స్ ఔత్సాహికుడు స్కాట్ సి.వారింగ్ నిశితంగా పరిశోధిస్తున్నాడు. ఈ పరిశోధనలో ఈ మహిళ శరీరాన్ని గుర్తించాడు. 
 
తాజాగా అది పంపిన ఓ చిత్రంలో పొడవైన జుట్టు, మహిళలు ధరించేలాంటి గౌను వేసుకున్న మహిళ వెల్లకిలా పడుకున్నట్టు ఉంది. దీనికి రంగలు వేసి చూసిన స్కాట్ అది మహిళ శరీరమేనని నిర్ధారించారు. ఇది ఈ శతాబ్దంలో కనుగొన్న గొప్ప విషయంగా ఆయన అభివర్ణించారు. ఇప్పటి వరకు మార్స్‌పై వందల కొలదీ కొత్త విషయాలను కనుగొన్నానని, అయితే ఇలా మానవునిలాంటి శరీరాన్ని కనుగొనడం ఇదే తొలిసారి ఆయన చెప్పారు. నాసా చిత్రంలో కనుగొన్న మహిళ ధరించినట్టుగా చెబుతున్న డ్రెస్ 1700 సంవత్సరాలలో భూమిపై ధరించేవారని ఆయన వివరించారు.