మంగళవారం, 19 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2016 (10:54 IST)

డొనాల్డ్ ట్రంప్‌పై మిచెల్లీ ఫైర్.. ఇక ఆపవయ్యా బాబు.. మహిళలను బలవంతంగా ముద్దెట్టుకుంటే?

రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు అతని అభ్యర్థిత్వంపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. అధ్యక్ష బరిలో హిల్లరీ క్లింటన్ వివాదరహితంగా దూసుకుపోతుం

రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు అతని అభ్యర్థిత్వంపై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. అధ్యక్ష బరిలో హిల్లరీ క్లింటన్ వివాదరహితంగా దూసుకుపోతుండగా, ట్రంప్ మాత్రం గతంలో చేసిన అసభ్యకర పనులు, ఇప్పుడు మహిళలపై అసభ్యకరంగా చేస్తున్న వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ వెనకబడిపోతున్నారు. కన్న కూతురుపై కూడా ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికా ప్రథమ పౌరురాలు మిచెల్లీ ఒబామా మండిపడ్డారు. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటి వరకు వరకు చేసిన వ్యాఖ్యలు చాలని, పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టాలని గట్టిగా హెచ్చరించారు. డొనాల్డ్ ట్రంప్ సాధారణ మనిషిలా ప్రవర్తించడం లేదని ఫైర్ అయ్యారు. 
 
లైంగిక స్వేచ్ఛ అంటే ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించడం కాదని మిచెల్లీ గట్టిగా చెప్పారు. మహిళలను బలవంతంగా ముద్దు పెట్టుకోవడం, వారిని అసభ్యంగా తాకుతూ పైశాచికానందం పొందడం తీవ్రమైన నేరాలేనని మిచెల్లీ తెలిపారు. మహిళల పట్ల ట్రంప్‌ది క్రూరమైన వైఖరని, మహిళలను బెదరింపులకు గురిచేయడం సహించకూడదని తెలిపారు.