బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 25 ఆగస్టు 2018 (12:20 IST)

నకిలీ వక్షోజాలతో బ్యూటీ టైటిల్.. ఆపరేషన్ కోసం అప్పుకూడా?

నకిలీ వక్షోజాలతో బ్యూటీ టైటిల్ గెలుచుకుంది బల్గేరియాకు చెందజిన మోడల్ క్రిస్టినా కామెనోవా. అప్పు తీసుకుని మరీ ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న ఆమె.. నకిలీ వక్షోజాలను ఇంప్లాంట్ చేయించుకుంది. ఆ తర్వాత బ్యూటీ

నకిలీ వక్షోజాలతో బ్యూటీ టైటిల్ గెలుచుకుంది బల్గేరియాకు చెందజిన మోడల్ క్రిస్టినా కామెనోవా. అప్పు తీసుకుని మరీ ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న ఆమె.. నకిలీ వక్షోజాలను ఇంప్లాంట్ చేయించుకుంది. ఆ తర్వాత బ్యూటీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బల్గేరియా దేశంలోని  సోఫియా నగరానికి చెందిన 24 ఏళ్ల మోడల్ క్రిస్టినా కామెనోవా బ్యూటీ టైటిల్ గెలుచుకోవాలనే పట్టుదలతో కష్టపడింది. 
 
ఈ క్రమంలో ఈ టైటిల్‌ను గెలుచుకోవడం కోసం ఆమె నకిలీ వక్షోజాలతో అందాల పోటీల్లో పాల్గొని టైటిల్ విజేతగా నిలిచింది. చాలా సంవత్సరాలుగా మిస్ సిలికాన్ స్టార్ కావాలనే కోరికతో వుండిన ఆమె నకిలీ వక్షోజాలను ఇంప్లాంట్ చేయించుకోవడం ద్వారా ఆ టైటిల్‌ను సొంతం చేసుకుంది. కాంటెస్టుకు ముందే ఈ ఆపరేషన్ చేయించుకుంది. 
 
కానీ కామెనోవా నకిలీ వక్షోజాలతో బ్యూటీ కాంటెస్ట్ గెలుచుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలను కామనెవో లైట్‌గా తీసుకుంది. తన కల నెరవేరిందని చెప్తోంది. ఈ మేరకు తన ఫోటోలను క్రిస్టినా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.