1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2016 (15:27 IST)

పిల్లలను స్వర్గానికి పంపాలన్న ఉద్దేశ్యంతో కన్నబిడ్డలను చంపిన పాస్టర్

భారతీయులు చాలా మూఢనమ్మకాలను ఫాలో అవుతారు. అందరూ కాకపోయిన కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఫాలో అయిపోతారు. కానీ అగ్రరాజ్యమైన అమెరికాలోనూ మూఢనమ్మకాలను ప్రజలు పాటిస్తున్నారంటే నమ్ముతారా? తన పిల్లలను స్వర్గానికి

భారతీయులు చాలా మూఢనమ్మకాలను ఫాలో అవుతారు. అందరూ కాకపోయిన కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఫాలో అయిపోతారు. కానీ అగ్రరాజ్యమైన అమెరికాలోనూ మూఢనమ్మకాలను ప్రజలు పాటిస్తున్నారంటే నమ్ముతారా? తన పిల్లలను స్వర్గానికి పంపాలనే మూఢనమ్మకంతో ఓ తల్లి చేసిన పని ఆ పసివారిని మృత్యుముఖంలోకి నెట్టేసింది. ఆ తల్లిని కటకటాల్లోకి పడేసింది. అమెరికాలోని ఇండియానాకు చెందిన అంబెర్ పాస్టర్ కన్నబిడ్డలను చంపిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తోంది. 
 
ఆమెను ఇటీవల ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలు విని అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు. ఆ రోజు చాలా మంచి రోజు. ఆ రోజు చనిపోయినవారు ఖచ్చితంగా స్వర్గానికి వెళతారని నాకు తెలిసింది. నా పిల్లలను కూడా స్వర్గానికి పంపాలని అనుకున్నాను. అందుకోసం నేను వారిని బలవంతం చేయలేదు. వారికి రెండు అవకాశాలు ఇచ్చాను. బతికి ఉండాలనుకుంటే రోజూ నాలాగే కష్టాలు పడాల్సి ఉంటుంది. చనిపోడానికి సిద్ధపడితే మాత్రం స్వర్గానికి చేరుకుంటారు. మీరే ఆలోచించుకోండి అని నా కొడుక్కి, కూతురికి చెప్పాను. చనిపోయి స్వర్గానికి చేరుకోవడానికి నా కూతురు(6 సంవత్సరాలు) ఒప్పుకుంది. 
 
అందుకే నా పాపను చంపేశాను. ఆ తర్వాత అక్కతోపాటే వెళ్తానని నా కొడుకు(4) అడిగాడు. అందుకే వాడిని కూడా చంపేశాను. ఇప్పుడు వారు ఆనందంగా, సంతోషంగా ఉన్నారని చెప్పలేను. కానీ, ఇంతకంటే మంచి ప్లేస్‌లో ఉన్నారని చెప్పగలనని ఆమె ఇంటర్వ్యూలో వెల్లడించింది. వారిని చంపేసిన తర్వాత పారిపోవడానికి ప్రయత్నించి పోలీసులకు చిక్కింది. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. అప్పట్నుంచి అంబర్ జైళ్లోనే మగ్గుతోంది.