చేతిలో సంచి.. భుజానికి బ్యాగు... రైల్వే స్టేషన్‌లో నగ్నంగా వ్యక్తి.. ఉలిక్కిపడిన ప్రయాణీకులు!
ప్రపంచంలో అతిపెద్ద జనాభా నగరం, జపాన్ రాజధాని టోక్యో. లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్కు కేంద్రం ఈ నగరం. అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతోంది. ప్రపంచంలో కొత్త ఫ్యాషన్లను అన్నిదేశస్థులకంటే టోక్యోవాసులు ఎక్కువ
ప్రపంచంలో అతిపెద్ద జనాభా నగరం, జపాన్ రాజధాని టోక్యో. లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్కు కేంద్రం ఈ నగరం. అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతోంది. ప్రపంచంలో కొత్త ఫ్యాషన్లను అన్నిదేశస్థులకంటే టోక్యోవాసులు ఎక్కువగా ఫాలో అవుతారు. అలాంటిది టోక్యోలోని ఓ రైల్వే స్టేషన్లోకి వస్తున్న ఆ వ్యక్తి వాలకం చూసి అక్కడున్నవారు ఉలిక్కిపడ్డారు.
ఉలిక్కిపడ్డారంటే అతడేమి రాక్షసుడు కాదు... మరి అతడిని చూసి తోటి ప్రయాణికులు ఎందుకు భయపడ్డారో తెలియాలంటే పూర్తి కథనం చదవాల్సిందే... టోక్యోలోని ఓ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. చాలామంది అతడిని చూసి భయపడ్డారు కూడా. దీనంతటికీ కారణం.. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా, చేతిలో సంచి.. భుజానికి కేవలం బ్యాగ్ తగిలించుకుని నగ్నంగా నడుచుకుంటూ వచ్చాడు.
అలా నగ్నంగా నడుచుకుంటూ టికెట్ కౌంటర్‌లోకి వచ్చి టికెట్టు కొనుకున్నాడు. అతడి నగ్న వేషాన్ని చూసి అక్కడున్నవారు విస్తుపోగా, మరికొందరు సెల్‌ఫోన్ కెమెరాలలో బంధించారు. దీంతో అక్కడ కొంతసేపు కలకలం రేగడంతో పోలీసులు ప్రవేశించారు. ఆ యువకుడు ఎందుకలా చేశాడో అర్థం కాని పోలీసులు అతగాడి ఒంటిపై దుస్తులు కప్పి.. అదుపులోకి తీసుకున్నారు.