1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 15 ఆగస్టు 2016 (11:20 IST)

శుక్ర గ్రహంపై నీటి జాడలు, చల్లటి ఉపరితల వాతావరణం ఉండేది: నాసా

శుక్ర గ్రహంపై తొలినాళ్ళలో 200 కోట్ల సంవత్సరాల వరకు నీటి జాడలు, చల్లటి ఉపరితల వాతావరణం ఉండేదని అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఆ నీరంతా సూర్యుని ప్ర‌భావంతో ఎండిపోయి ఉంటుంద‌ని చెప్

శుక్ర గ్రహంపై తొలినాళ్ళలో 200 కోట్ల సంవత్సరాల వరకు నీటి జాడలు, చల్లటి ఉపరితల వాతావరణం ఉండేదని అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.  అయితే ఆ నీరంతా సూర్యుని ప్ర‌భావంతో ఎండిపోయి ఉంటుంద‌ని చెప్పారు. వివిధ గ్రహాల పూర్వ, భవిష్యత్ వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తున్న తమకు ఈ విషయం తెలిసిందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. అక్కడ కార్బ‌న్ డయాక్సైడ్ కూడా అధిక‌మేన‌ని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
 
ప్రస్తుతం భూమి కంటే అక్క‌డ‌ 90 రెట్లు అధికంగా ఈ వాయువు ఉంది. అయితే తేమ అస్సలు లేదు. శుక్రుడిలో ఉపరితల ఉష్ణోగ్రత 462 డిగ్రీలకు చేరింద‌ట‌. భూమి త‌యారైన విధంగా శుక్రగ్రహం కూడా ఒకే రకమైన పదార్థాలతో తయారైంద‌ని, 80వ దశకంలో తాము పయోనీర్ ద్వారా శుక్రుడిపై చేసిన పరిశోధనల ప్రకారం శుక్రుడిపై ఒకప్పుడు సముద్రం ఉండే అవకాశం ఉన్న‌ట్లు తెలిసిందన్నారు.
 
ఆకాశంలో సూర్యచంద్రుల తర్వాత అత్యంత ప్రకాశవంతంగా వెలిగేది శుక్రగ్రహం. శుక్రగ్రహం ఒక్కోసారి వేగుచుక్కగా సూర్యోదయానికి ముందు తూర్పున కనిపిస్తుంది. ఒక్కోసారి సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ దిక్కున కనపడుతుంది. ఈ గ్రహం కూడా చంద్రునివలె భూమికి సూర్యునికి మధ్య వుంటుంది. కనుక దీనికి చంద్రునిలా కళలు వుంటాయి. దూరదర్శినిలో చూస్తే శుక్రుడు భూమికి అతి దగ్గరగా వున్నప్పుడు నెలవంకలా, అతి దూరంలో వున్నప్పుడు పూర్ణ బింబంలా కనిపిస్తాడు.