సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (17:50 IST)

న్యూజిలాండ్ ప్రధాని సంచలన నిర్ణయం...

న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిందా ఆర్డ్రెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 15వ తేదీన క్రైస్ట్ చర్చి నగరంలో రెండు మసీదుల్లో జరిగిన ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు భారతీయులతో పాటు.. మొత్తం 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడి ఘటనతో ఆమె తీవ్రంగా కలత చెందారు. 
 
పైగా, దేశంలో ఇలాంటి ఘటనలు మరోమారు జరుగకుండా గన్ చట్టాల్లో మార్పులు చేశారు. మిలటరీ స్టైల్ సెమీ ఆటోమెటిక్ గన్స్, అన్ని రకాల అసాల్ట్  రైఫిల్స్, సెమీ ఆటోమెటిక్ రైఫిళ్ల విక్రయాలను బహిరంగ మార్కెట్‌లో నిషేధం విధించారు. హై కెపాసిటీ రైఫిళ్లతో పాటూ ఫైర్ ఆర్మ్‌ను మిలిటరీ తరహా ఆటోమేటిక్ తుపాకులుగా మార్చే పరికరాలను కూడా ఇకపై ఎవరూ అమ్మడానికి వీల్లేదన్నారు.
 
సెమీ ఆటోమెటిక్ రివాల్వర్లతోపాటు ఉగ్రదాడిలో నిందితుడు బ్రెంటన్ వాడిన అన్ని రకాల ఆయుధాలపైనా నిషేధం విధిస్తున్నట్లు ఆమె ప్రకటించింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందంటూ ప్రధాని అధికారిక ప్రకటన జారీచేశారు. తుపాకీ చట్టం అమల్లోకి రావడానికంటే ముందు మధ్యంతర చర్యగా ఆయుధాల అమ్మకాలపై బ్యాన్‌ విధించినట్టు జసిండా తెలిపారు.