ఫేస్‌బుల్ లైవ్‌లో మాట్లాడుతుండగా.. జర్నలిస్టును హతమార్చారు.. ఎక్కడ?
టీవీ లైవ్‌లో మాట్లాడుతుండగా జర్నలిస్ట్ హత్యకు గురైన ఘటన సెంట్రల్ అమెరికా దేశమైన నికరాగ్వాలో చోటుచేసుకుంది. సామాజిక భద్రతా పథకాల సంస్కరణలపై నికరాగ్వా అధ్యక్షుడు డేనియల్ అర్టేగా ఆ దేశ చట్టసభలో గత బుధవార
టీవీ లైవ్‌లో మాట్లాడుతుండగా జర్నలిస్ట్ హత్యకు గురైన ఘటన సెంట్రల్ అమెరికా దేశమైన నికరాగ్వాలో చోటుచేసుకుంది. సామాజిక భద్రతా పథకాల సంస్కరణలపై నికరాగ్వా అధ్యక్షుడు డేనియల్ అర్టేగా ఆ దేశ చట్టసభలో గత బుధవారం ప్రవేశపెట్టిన బిల్లు తీవ్ర ఆందోళనలకు కారణమైంది. దీంతో అప్పటి నుంచి నికరాగ్వా తీవ్ర నిరసనలతో అట్టుడుకుతోంది.
నిరసనకారులు ధ్వంసం చేసిన ఏటీఎం సెంటర్ గురించిన ప్రసారాలను లైవ్ ద్వారా వివరిస్తున్న స్థానిక టీవీ ఛానల్ జర్నలిస్ట్ ఏంజెల్ గహోనాను గుర్తు తెలియని ఆగంతకులు కాల్చి చంపారు. దీంతో.. ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ నిరసనల్లో ఇప్పటివరకు 25 మంది మృతి చెందినట్లు మానవహక్కుల సంఘాలు చెబుతున్నాయి.