శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (16:54 IST)

చర్చలు - ఉగ్రవాదం కలిసి ముందుకు సాగలేవు : పాకిస్థాన్

భారతదేశంతో సంబంధాల మెరుగుపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మొహ్మద్ ఖురేషీ కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలు, ఉగ్రవాదం కలిసి ముందుకు సాగలేవని చెప్పుకొచ్చారు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో చర్చలు అసాధ్యమని ఆయన తేల్చిపారేశారు.
 
ముల్తాన్‌లో బుధవారం మీడియాలో మాట్లాడుతూ, అన‌ధికారికంగాగానీ, దౌత్య‌ప‌ర‌మైన చ‌ర్చ‌లుగానీ సాధ్య‌మ‌య్యే ప‌రిస్థితులు లేవ‌న్నారు. ఇటు ఇండియా కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. చ‌ర్చ‌లు, ఉగ్ర‌వాదం క‌లిసి వెళ్ల‌లేవ‌ని చెబుతూ వ‌స్తోంది. 
 
2016లో ప‌ఠాన్‌కోట్‌లో దాడి త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు దిగ‌జారిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత పుల్వామా దాడి, పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్‌లో ఇండియ‌న్ ఆర్మీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌తో ప‌రిస్థితులు మ‌రింత ఉద్రిక్తంగా మారాయి. అందువల్ల భారత్‌తో చర్చలు సాధ్యంకాదని ఆయన చెప్పుకొచ్చారు.