సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (10:04 IST)

భారత్‌లో మరో 23 వేల కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కొత్తగా మరో 23 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్యతో కలుపుకుని మన దేశంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,00,99,066కు చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
కాగా, మంగళవారం కొత్తగా నమోదైన కేసుల సంఖ్య తగ్గగా, బుధవారం సుమారు నాలుగువేలకుపైగా కేసులు పెరిగాయి. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,00,99,066కు పెరిగింది. 
 
ఈ మహమ్మారి నుంచి తాజాగా 26,895 మంది కోలుకుకోగా.. ఇప్పటివరకు 96,63,382 డిశ్చార్జి అయ్యారు. మరో 333 మంది వైరస్‌ ప్రభావంతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,46,444కు చేరింది. 
 
ప్రస్తుతం దేశంలో 2,89,240 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. మంగళవారం దేశవ్యాప్తంగా 10,98,154 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ తెలిపింది. ఇప్పటి వరకు 16,42,68,721 టెస్టులు చేసినట్లు పేర్కొంది.
 
అలాగే, తెలంగాణలో గత 24 గంటల్లో 635 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 573 మంది కోలుకున్నారు. 
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,82,982కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,74,833 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,522కి చేరింది. 
 
తెలంగాణలో ప్రస్తుతం 6,627మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 4,467 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 115 కరోనా కేసులు నమోదయ్యాయి.