మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2017 (12:23 IST)

పిచ్చిపట్టిన ముసలోడు ట్రంప్... మరణాన్ని కానుకగా ఇస్తాం : ఉత్తర కొరియా

ఉత్తర కొరియా మరోమారు గర్జించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. ట్రంప్ ఓ పిచ్చిపట్టిన ముసలోడని, ఆయనకు మరణాన్ని కానుకగా ఇస్తామని ప్రకటించారు.

ఉత్తర కొరియా మరోమారు గర్జించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. ట్రంప్ ఓ పిచ్చిపట్టిన ముసలోడని, ఆయనకు మరణాన్ని కానుకగా ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర కొరియా ఓ ఫొటోను విడుదల చేసింది. ఈ ఫోటో ట్రంప్‌ను తల్లకిందులుగా వేలాడదీయగా, ఆయన నోటి నుంచి రక్తం కారుతున్నట్టుగా ఉంది. 
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తాము మరణాన్ని కానుకగా ఇవ్వనున్నామని అందులో పేర్కొన్నారు. "పిచ్చి పట్టిన స్థితిలో ఉన్న ముసలోడు ట్రంప్‌కు మరణాన్ని అందించాల్సి వుంది" అన్న క్యాప్షన్ ఈ ఫొటోపై ఉంది. ఈ ఫొటో ఇప్పుడు ఉత్తర కొరియా మీడియాలో చక్కర్లుకొడుతోంది. గత నెలలో యూఎస్ బాంబర్లను పేల్చివేస్తున్నట్టు, ఆ తర్వాత అమెరికా నగరాన్ని సర్వనాశనం చేస్తున్నట్టు గ్రాఫిక్స్ చేసిన వీడియోలను ఉత్తర కొరియా విడుదల చేసిన సంగతి తెలిసిందే.