గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (11:44 IST)

ఉత్తర కొరియా అణు పరీక్ష.. 5.1 తీవ్రతతో భూప్రకంపనలు

ఉత్తర కొరియా మరో అణు పరీక్ష నిర్వహించిందని దక్షిణ కొరియా, జపాన్ దేశాలు వెల్లడించాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేశామని, దానిని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పరిశీల

ఉత్తర కొరియా మరో అణు పరీక్ష నిర్వహించిందని దక్షిణ కొరియా, జపాన్ దేశాలు వెల్లడించాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేశామని, దానిని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పరిశీలించారని చెబుతూ ఫోటోలు విడుదల చేసింది. అలా విడుదల చేసిన కొన్ని గంటల్లోనే అణుపరీక్షను ఉత్తరకొరియా నిర్వహించిందని దక్షిణ కొరియా తెలిపింది. 
 
అణు పరీక్షల నేపథ్యంలో ఉత్తరకొరియాలోని ఈశాన్య ప్రాంతమైన సున్‌ గ్జిబేగమ్‌‌లో 5.1 తీవ్రతతో పేలుడు సంభవించిందని దక్షిణకొరియా తెలిపింది. ఈ పేలుడు ధాటికి ఉత్తరకొరియాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించిందని దక్షిణ కొరియా వెల్లడించింది. దీనిని జపాన్ నిర్ధారించింది. కాగా, ఈ తాజా పరీక్షతో ఉత్తరకొరియా ఇప్పటివరకు ఆరు అణు పరీక్షలు నిర్వహించినట్టైంది. గత ఏడాది రెండు అణుపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.