మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2017 (14:32 IST)

హ్యాకింగ్ వల్లే అమెరికా కుట్రను బయటపెట్టాం: ఉత్తరకొరియా హ్యాకర్లు

అమెరికా లక్ష్యం తమ దేశాధ్యక్షుడిని హతమార్చేందుకు.. దానికి దక్షిణ కొరియా పూర్తి సహకారం అందిస్తుందని.. హ్యాకింగ్ వల్లే అమెరికా కుట్రను బయటపెట్టామని ఉత్తరకొరియా హ్యకర్లు చెప్తున్నారు. దక్షిణ కొరియాపై హ్య

అమెరికా లక్ష్యం తమ దేశాధ్యక్షుడిని హతమార్చేందుకు.. దానికి దక్షిణ కొరియా పూర్తి సహకారం అందిస్తుందని.. హ్యాకింగ్ వల్లే అమెరికా కుట్రను బయటపెట్టామని ఉత్తరకొరియా హ్యకర్లు చెప్తున్నారు. దక్షిణ కొరియాపై హ్యాకింగ్ చేసి 235 గిగా బైట్ల డేటాను దొంగలించామని.. హ్యాకర్లు తెలిపారు. 
 
తాము తస్కరించిన డేటాలో అమెరికా, దక్షిణకొరియాల సైనిక రహస్యాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తమ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ను హతమార్చేందుకు అమెరికా, దక్షిణకొరియాలు కుట్రపన్నాయని హ్యాకర్లు వెల్లడించారు.
 
అంతేగాకుండా.. ఆ రెండు దేశాలు యుద్ధం సమయంలో అనుసరించాల్సి వ్యూహాలను కూడా డాక్యుమెంట్ల రూపంలో పొందుపరిచారని హ్యాకర్లు తెలిపారు. దక్షిణ కొరియా డిఫెన్స్ మినిస్ట్రీ పేరిట ఉన్న ఈ పత్రాలు తమ చేతికి చిక్కడంతో దక్షిణ కొరియా దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయిందని హ్యాకర్లు చెప్పుకొచ్చారు. 
 
కాగా హ్యాకర్ల పుణ్యమా అని ఉత్తర కొరియా చీఫ్‌ను హతమార్చేందుకు దక్షిణ కొరియా అమెరికాకు సహకరించిందని తెలియడంతో.. ఆ దేశంపై కిమ్ జాంగ్ ప్రభుత్వం యుద్ధానికి సర్వం సిద్ధం చేస్తోంది.