శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2017 (13:31 IST)

ఢిల్లీ పిల్ల తలపొగరు... మళ్లీ నోరు జారింది...

ఢిల్లీ తెల్లపిల్ల తాప్పీ మళ్లీ నోరుజారింది. అయితే, ఈసారి మాత్రం టాలీవుడ్ ప్రముఖులపై కాదు.. బాలీవుడ్ స్టార్ హీరోలపై. బాలీవుడ్ హీరోలెవ్వరూ తనను గుర్తించడం లేదంటూ ఆమె వాపోతోంది.

ఢిల్లీ తెల్లపిల్ల తాప్పీ మళ్లీ నోరుజారింది. అయితే, ఈసారి మాత్రం టాలీవుడ్ ప్రముఖులపై కాదు.. బాలీవుడ్ స్టార్ హీరోలపై. బాలీవుడ్ హీరోలెవ్వరూ తనను గుర్తించడం లేదంటూ ఆమె వాపోతోంది. 
 
నిజానికి తాప్సీకి మొదటి నుంచీ కాస్త నోరు ఎక్కువే అంటారు సినీ జనాలు. ఏ ఎండకాగొడుగు పట్టే క్రమంలో తరచూ నోరు పారేసుకుంటూ ఉంటుంది. అలా నోటికొచ్చినట్టు మాట్లాడే దక్షిణాదిన పూర్తిగా అవకాశాలను పోగొట్టుకుంది. తాజాగా, బాలీవుడ్‌పై అవాకులు చవాకులు పేలింది. తనకు స్టార్‌ హీరోయిన్‌తో సమానమైన రేంజ్‌ ఉన్నా పెద్ద హీరోలెవరూ గుర్తించడం లేదు అంటూ ఓ బాంబు పేల్చింది. 
 
వాస్తవానికి బాలీవుడ్‌లో ఏ గ్రేడ్‌ హీరోయిన్లతో పోల్చుకున్నా తాప్సీ రేంజ్‌ తక్కువే. అక్కడ ఆమె నటించిన సినిమాలు చాలా తక్కువ. ఆ సినిమాలు హిట్‌ అయ్యాయి అంటే అదేమీ ఆమె ప్రతిభాపాటవాలతో కాదు అన్న సంగతి. ఆ విజయాలన్నీ తన గొప్పతనమే అన్నట్టు మాట్లాడుతోంది. ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్‌ పెద్దలు కారాలు మిరియాలు నూరుతున్నారు.