అలీ ఏడుస్తూ నా దగ్గరకొచ్చాడు... ఎందుకేడుస్తున్నావనడిగితే.... పోసాని
సినీ ఇండస్ట్రీలో ఒకరి పాత్రను ఇంకొకరు ఎగరేసుకుని వెళ్లిపోవడం మామూలే. ఒక నటుడితో అనుకున్న చిత్రాన్ని చివరి క్షణాల్లో మరో నటుడితో చేసేస్తుంటారు. ఇంకాస్త ముందుకు పోతే ఒక నటుడిని పెట్టుకోవాలని నిర్ణయించిన
సినీ ఇండస్ట్రీలో ఒకరి పాత్రను ఇంకొకరు ఎగరేసుకుని వెళ్లిపోవడం మామూలే. ఒక నటుడితో అనుకున్న చిత్రాన్ని చివరి క్షణాల్లో మరో నటుడితో చేసేస్తుంటారు. ఇంకాస్త ముందుకు పోతే ఒక నటుడిని పెట్టుకోవాలని నిర్ణయించిన తర్వాత ఆ పాత్ర కోసం మరో నటుడు ప్రయత్నం చేయడం, అవసరమైతే తన రెమ్యునరేషన్ తగ్గించేసుకోవడం వంటివన్నీ జరుగుతుంటాయి.
తనకు పాత్ర దక్కించుకునేందుకు ఇలాంటి వెన్నుపోటులు ఇండస్ట్రీలో మామూలే. ఐతే పోసాని కృష్ణమురళి మాత్రం మీడియా వారు ఏదైనా ప్రశ్న వేస్తే సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే చేశారు. ఎప్పుడూ నవ్వుతూ వుండే అలీ ఒకసారి తన వద్దకు వచ్చి ఏడ్చాడట.
ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తే... మన ఇద్దర్నీ ఓ సినిమాలో బుక్ చేశారనీ, ఐతే వారికి అంత డబ్బు ఇవ్వడం దేనికి? అంతకంటే తక్కువ వారు చేస్తారు కదా అని దర్శకనిర్మాతలకు చెప్పి తమ ఇద్దరినీ సినిమా నుంచి తీసివేయించారంటూ అలి తెగ బాధపడ్డాడట. సినీ ఇండస్ట్రీలో ఎన్నో పరిచయాలు, అనుభవం వున్నవారికే ఇలా వుంటే కొత్తగా సినీ ఇండస్ట్రీకి వచ్చే వారి సంగతేమిటో?