సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 25 జులై 2017 (17:33 IST)

అకున్ సబర్వాల్ వుంది మమ్మల్ని ఏడిపించడానికా రాజా...? పోసాని కృష్ణమురళి

డ్రగ్స్ కేసులో సినిమా ఇండస్ట్రీకి చెందిన 12 మందికి నోటీసులు ఇస్తే అది టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేసినట్లు ఎట్లా అవుతుంది రాజా అని నటుడు పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. 30 వేల మంది వున్న సినీ ఇండస్ట్రీలో 12 మందికి నోటీసులు ఇస్తే సినీ ఇండస్ట్రీని ట

డ్రగ్స్ కేసులో సినిమా ఇండస్ట్రీకి చెందిన 12 మందికి నోటీసులు ఇస్తే అది టాలీవుడ్ ఇండస్ట్రీని టార్గెట్ చేసినట్లు ఎట్లా అవుతుంది రాజా అని నటుడు పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు. 30 వేల మంది వున్న సినీ ఇండస్ట్రీలో 12 మందికి నోటీసులు ఇస్తే సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేసినట్లవుతుందా నాన్నా... నాకు తెలియదులే అవుతుందా అంటూ ప్రశ్నించారు. ఓ ప్రైవేట్ టెలివిజన్ చానల్ ఇంటర్య్వూలో మాట్లాడుతూ... దేశంలోకి డ్రగ్స్ రాకుండా కేంద్రం చర్యలు చేపట్టాలి. డ్రగ్స్ అంతానికి కంకణం కట్టుకున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ఎందుకు నిందిస్తున్నారు. ఇక్కడి సినీ ఇండస్ట్రీ పెద్దలకు డ్రగ్స్ అలవాట్లు లేవు.
 
అకున్ సబర్వాల్ వుంది మమ్మల్ని ఏడిపించడానికా రాజా...? ఎందుకు పెట్టాము. ఇన్ని కోట్ల మంది జనంలో ఎవరైనా తప్పుదారి పట్టి సమాజానికి చెడ్డ చేస్తే వారిని అదుపులోకి తీసుకుని సమాజాన్ని క్లీన్‌గా వుంచాలని మనమే పెట్టాం. విచారించే అధికారాలు, హక్కులు కూడా వారికి మనమే.... అంటే రాజ్యాంగం ద్వారా కల్పించాం. ఇవన్నీ చేశాక వాళ్ల బాధ్యత వాళ్లు నిర్వర్తిస్తుంటే తప్పేంటి రాజా అని ప్రశ్నించారు.
 
30 వేల మంది వున్న ఇండస్ట్రీలో కొంతమందిపై అనుమానాలున్నాయి. అందుకే 12 మందిని పిలిచారు. ఒక్కొక్కరిని మర్యాదగా అడుగుతున్నారు. మనం సహకరిస్తే సొసైటీ బావుంటుంది నాన్నా. అంతెందుకు ఇండస్ట్రీలో ఇంతమంది వుంటే ఆ 12 మందికే ఎందుకిచ్చారు... ఏదో అనుమానం కలిగింది. నివృత్తి చేసుకుంటున్నారు. వారు చేస్తున్న విచారణకు మనం కూడా హుందాగా ప్రవర్తించి ముందుకు పోతే బావుంటుంది. 
 
మీడియా తప్పుగా రాస్తుంది అనుకోవడం ఎందుకు... పోసాని తప్పు చేస్తే పోసాని వెధవ అని రాస్తారు.. నా నిజాయితీ నిరూపితమైతే పోసాని చాలా మంచోడు అని కూడా రాస్తారు. బాధెందుకు రాజా... ఎవరో ఏదో అనుకుంటున్నారని సిగ్గెందు. చక్కగా సహకరిస్తే వాళ్ల అనుమానాలు తీరుతాయి. తేడా ఏదయినా వుంటే తర్వాత సంగతి చూసుకుంటారంటూ పోసాని వ్యాఖ్యానించారు. చార్మి పిటీషనుకు సంబంధించి వీడియో...