బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 29 ఆగస్టు 2017 (18:10 IST)

నా మేనల్లుడు కొరటాల శివను అడుక్కోను... పోసాని, అంత దమ్ముందట...

పోసాని కృష్ణమురళి అనగానే అదో టైపు అనే మాటలు చాలామంది అనేస్తుంటారు. తను చెప్పాల్సింది ముఖం మీద చెప్పేయడంతోనే ఆయన్ను అలా అంటారనుకోండి. ఇప్పుడు పోసాని కృష్ణమురళి మళ్లీ కొన్ని మాటలు మాట్లాడేశారు. రచయిత, దర్శకుడు, నిర్మాతలు కంటే కూడా నటుడి జీవితం చాలా హ్య

పోసాని కృష్ణమురళి అనగానే అదో టైపు అనే మాటలు చాలామంది అనేస్తుంటారు. తను చెప్పాల్సింది ముఖం మీద చెప్పేయడంతోనే ఆయన్ను అలా అంటారనుకోండి. ఇప్పుడు పోసాని కృష్ణమురళి మళ్లీ కొన్ని మాటలు మాట్లాడేశారు. రచయిత, దర్శకుడు, నిర్మాతలు కంటే కూడా నటుడి జీవితం చాలా హ్యాపీ అని సెలవిచ్చారు. 
 
అలాగని తను ఎవ్వరినీ నటించేందుకు పాత్రలు ఇవ్వాలని అడుక్కోనని చెపుతున్నారు. ఆఖరికి తన మేనల్లుడు కొరటాల శివను కూడా తనకు వేషం ఇవ్వాలని ప్రాధేయపడనని నొక్కి వక్కాణించారు. అతి తక్కువ సమయంలోనే 100 సినిమాల్లో తను నటించాననీ, తనకు పోటీగా, తనంత టాలెంటుతో ఎవరో వస్తారని అస్సలు భయపడననీ, తనకు ఆ దమ్ము వుందని అంటున్నాడు. మొత్తమ్మీద 'మెంటల్ కృష్ణ' అనిపించాడు కదూ అనే సెటైర్లు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో వినబడుతున్నాయి.