శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శనివారం, 26 ఆగస్టు 2017 (16:11 IST)

ఆమెను కలిసిన తరువాతనే నా దశ తిరిగింది... తిరుమలలో నటుడు ఆది(వీడియో)

నటుడు ఆదిని సాయికుమార్ కుమారుడు అంటేనే ఎక్కువమంది గుర్తుపడతారు. ఆది కొన్ని సినిమాల్లో నటించినా ఆయన పేరు చాలామందికి తెలియదు. సాయికుమార్ కొడుకు అంటేనే చాలామంది గుర్తుపడతారు. అదేమరి సాయికుమార్‌కు ఉన్న ఇమేజ్. ఆ ఇమేజ్‌తోనే కొడుకు సినిమాల్లోకి వచ్చాడు. పెద

నటుడు ఆదిని సాయికుమార్ కుమారుడు అంటేనే ఎక్కువమంది గుర్తుపడతారు. ఆది కొన్ని సినిమాల్లో నటించినా ఆయన పేరు చాలామందికి తెలియదు. సాయికుమార్ కొడుకు అంటేనే చాలామంది గుర్తుపడతారు. అదేమరి సాయికుమార్‌కు ఉన్న ఇమేజ్. ఆ ఇమేజ్‌తోనే కొడుకు సినిమాల్లోకి వచ్చాడు. పెద్దగా ఛాన్సులు లేకపోయినా అప్పుడప్పుడు ఒక్కో సినిమాలో నటిస్తూ వస్తున్నాడు. 
 
అయితే పెళ్ళయిన తరువాత ఆదికి దశ తిరిగిందట. ఆ విషయాన్నే ఆయనే స్వయంగా చెప్పారు. తిరుమల శ్రీవారిని ఈరోజు విఐపి విరామ దర్శనా సమయంలో దర్శించుకున్న ఆది, మీడియాతో మాట్లాడారు. అరుణను కలిసి, పెళ్ళి చేసుకున్న తరవాతనే తన దశ తిరిగిందని, అంతవరకు పెద్దగా సినిమాలు లేవని చెప్పారు. 
 
ఈటీవీలో యాహూ యాంకర్‌గా ఉన్న ప్రభాకర్ మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నానని, ఆ సినిమాలో ప్రముఖ వ్యాఖ్యాత రేష్మి కూడా హీరోయిన్‌గా నటిస్తోందని చెప్పారు నటుడు ఆది.