శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 అక్టోబరు 2021 (21:48 IST)

అజేయ సైన్యం నిర్మిస్తాను.. కిమ్ భీష్మ ప్రతిజ్ఞ

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్న దూకుడు పెంచారు. మాటలతో మంటలు పుట్టిస్తున్నారు. ఇప్పటికే ఎయిర్ క్షిపణులు ప్రయోగించి ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చిన కిమ్.. తాజాగా మరో హాట్ స్టేట్ మెంట్ ఇచ్చారు. అజేయ సైన్యం నిర్మిస్తానని కిమ్ ప్రతిజ్ఞ చేశారు. అమెరికా అనుసరిస్తున్న ఉద్రిక్త పాలసీల నేపథ్యంలో కిమ్ చేసిన ఈ ప్రకటన చర్చనీయాంశంగా మారింది.
 
రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనలో పాల్గొన్న కిమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియా ఆయుధ అభివృద్ధి కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే అని, యుద్ధం చేయడానికి కాదని స్పష్టం చేశారు. ఉత్తర కొరియా ఇటీవలే సూపర్‌ సోనిక్‌, యాంటీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్షిపణులను ప్రయోగించిన సంగతి తెలిసిందే. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలకు అమెరికాయే కారణమని కిమ్ జోంగ్ ఉన్ మరోసారి ఆరోపించారు. అస్థిరతకు అమెరికా మూల కారణమని మండిపడ్డారు. 
 
ఆగస్టులో అమెరికా, దక్షిణ కొరియా దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహించడం ఉత్తర కొరియా ఆగ్రహానికి కారణమైంది. తొలిసారిగా జలాంతర్గామి క్షిపణిని దక్షిణ కొరియా పరీక్షించింది. ఈ విన్యాసాలపై కిమ్ జోంగ్ ఉన్ మండిపడ్డారు.