శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 జులై 2021 (19:33 IST)

దక్షిణ కొరియా యాసలో మాట్లాడితే తాట తీస్తాం: కిమ్ జోంగ్ ఉన్

ఉత్తర కొరియా పౌరులకు ఆదేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం అదేశపౌరుల వెన్నులో వణుకుపుట్టిస్తుంది. ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా యువత దక్షిణకొరియా ట్రెండ్‌ను ఫౌలో అవుతుండటం కిమ్‌కు ఏమాత్రం నచ్చటంలేదు. ఎలాగానా యువతను దారిలో పెట్టాలనుకున్నాడో ఏమో తెలియదుకాని కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు.
 
ఉత్తర కొరియన్లు ఇకపై దేశ భాషకు మాత్రమే కట్టుబడి ఉండాలని, వేషధారణలో ఇతర దేశాల శైలిని అనుకరించవద్దని స్పష్టమైన ఆదేశాలను కిమ్ ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పటికే చాలామంది యువత దక్షిణ కొరియా యాసలో మాట్లాడుతున్నారని ఇకపై అలాంటి యాసలో మాట్లాడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరికలు జారీ అయ్యాయి. 
 
ఇదే విషయంపై ఉత్తర కొరియా పాలక వర్కర్స్ పార్టీ అధికారిక వార్తా పత్రిక రొడాంగ్ సిన్మున్‌లో కేశాలంకరణ మొదలు, ధరించే వస్త్రదారణ, మాట్లాడే పదాల వరకు ప్రతిదానిపై దక్షిణ కొరియా యెక్క ప్రభావం ఉండటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
 
ఇతరుల సాంప్రదాయాలను, సాంస్కృతిక అంశాలను అనుసరించటం తుపాకులు ధరించి ఉన్న శత్రువులకంటే ప్రమాదకరంగా భావించాల్సి ఉంటుందన్న హెచ్చరికలు ఉత్తర కొరియా పౌరులకు జారీ అయ్యాయి.  
 
దక్షిణ కొరియాకు సంబంధించిన వీడియోలను రహస్యంగా వీక్షించిన, ఆయాసతో కూడిన భాష మాట్లాడినా, డ్రస్సులు ధరించిన వారికి 15 సంవత్సరాలపాటు జైలు శిక్ష విధిస్తామని కిమ్ ప్రభుత్వ ప్రకటనతో యువతలో మరింత భయాందోళనలు మొదలయ్యాయి. ఇందుకుగాను ఏకంగా 215 నిబంధనలను రూపొందించారు. టైట్ జీన్స్ ఫ్యాట్లు, బొమ్మల టీషర్టులు, వేయటం నిషేదించారు. 
 
ఒకవేళ టీషర్టు ధరించినా దానిపై ఎలాంటి స్లోగన్లు ఉండరాదు. ముక్కు, పెదాలు కుట్టించుకోకూడదు. దక్షిణకొరియా, సినిమాలు, సంగీతాన్ని వినకూడదు. స్పైక్, ముల్లెట్ తరహా హెయిర్ స్టైల్‌పై నిషేదం విధించారు.